స్కూల్ పిల్లల బ్యాగులో ఏముంటాయి..? పెన్నులు, పెన్సిల్, పుస్తకాలు ఉంటాయి. కాని అక్కడి స్కూల్ పిల్లల బ్యాగులో మాత్రం వీటికి బదులు కండోమ్, గర్భనిరోధక మాత్రలు కనిపించడం సంచలనంగా మారింది.
8,9,10 తరగతి చదివే విద్యార్థులు తరగతి గదుల్లోకి సెల్ ఫోన్స్ తీసుకొస్తున్నారని ఫిర్యాదులు అందాయి. దీంతో విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూల్స్ లోనూ తనిఖీలు చేపట్టాలని స్కూల్స్ యాజమాన్యాలను ఆదేశించింది. ఇందులో భాగంగా బెంగళూర్ లోని ఓ స్కూల్ లో 8,9,10వ తరగతి విద్యార్థుల బ్యాగ్ లను చెక్ చేయగా అందులోనున్న వస్తువులను చూసి టీచర్లు షాక్ అయ్యారు.
విద్యార్థుల బ్యాగ్ లో పుస్తకాలతోపాటు కండోమ్ , గర్భనిరోధక మాత్రలు, సిగరెట్లు, లైటర్లు చూసిన టీచర్లు బిత్తరపోయారు. అంతేకాదు కొంతమంది స్టూడెంట్స్ తీసుకొచ్చే వాటర్ బాటిల్స్ లో మద్యం కలిపి ఉన్నట్లు తేలింది. వెంటనే స్కూల్ యాజమాన్యం పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లలు ఇంటికొచ్చాక ఎం చేస్తున్నారో ఓ కన్నేసి ఉంచాలని సూచించారు.
ఈ విషయం కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.