టీఆర్ఎస్ నేతలు మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజ్ రవిచంద్రలకు సీబీఐ నుంచి పిలుపు వచ్చింది. గురువారం విచారణకు హాజరు కావాలంటూ నోటిసులు జారీ చేసింది.
ఢిల్లీలో అరెస్ట్ అయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కు సంబంధించిన కేసులో గంగుల కమలాకర్, వద్దిరాజ్ రవిచంద్రలకు సీబీఐ నోటిసులు పంపింది. అరెస్ట్ అయిన నకిలీ అధికారి శ్రీనివాస్ మంత్రి గంగుల కమలాకర్ తో టచ్ లో ఉన్నారని సీబీఐ వర్గాలు అంటున్నాయి.
తనకు ఉన్న పరిచయాలతో గ్రానైట్ వ్యవహారాలకు సంబంధించిన కేసులో ఉపశమనం పొందేలా శ్రీనివాస్ ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ లోని మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి వెళ్ళారు. శ్రీనివాస్ తో సంబంధాలు , ఎవరెవరితో మాట్లాడారు అనే దానిపై సమాచారం తెలుసుకునేందుకు గంగుల , వద్దిరాజ్ లకు సీబీఐ నోటిసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.