తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ ఈజీగా అంతుచిక్కవు. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చెప్పడం, అంచనా వేయడం కష్టం. ముందస్తు ఎన్నికల్లుండవని కేసీఆర్ పదేపదే చెబుతున్నా.. ఎందుకోఆయన ప్రకటనలు ఎవరికీ నమ్మశక్యంగా అనిపించడం లేదు. అందుకు కారణం ఎన్నడు లేనంతగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కేసీఆర్ ఆదేశిస్తుండటమే.
అభివృద్ధిలో దూకుడు
డబుల్ బెడ్ రూమ్, సొంత జాగాలున్న వారికీ 3 లక్షల రూపాయల ఆర్ధిక సాయం, దళిత బంధు వంటి సంక్షేమ పథకాల్లో వేగిరంపై కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు అధ్వానంగా మారడంతో మార్చినాటికీ రోడ్లను అద్దంలా మార్చాలని ఆదేశిస్తున్నారు. సచివాలయ నిర్మాణ పనులు కూడా సంక్రాంతికి ఫినిష్ చేయాలని అధికారులకు గడువు విధించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు శంకుస్థాపన చేయబోతున్నారు.
ఉద్యోగాల భర్తీ వేగవంతం
మార్చిలో జరిగిన అసెంబ్లీలో ఎనభై వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని కేసీఆర్ ప్రకటించారు. తక్షణం నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పినా నోటిఫికేషన్ల ప్రక్రియ ఆలస్యంగా జరుగుతోంది. ఎనిమిది నెలల తరువాత ప్రస్తుతం దూకుడు పెంచుతున్నారు. వచ్చే మార్చి వరకూ చెప్పినట్టుగా నియామకాలను భర్తీ చేయాలని టార్గెట్ పట్టుకున్నారు.
Also Read : రేవంత్ కు సహకరిస్తోన్న టీఆర్ఎస్ , బీజేపీ
జనాల్లోకి కేసీఆర్
డిసెంబర్ లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కేంద్రాన్ని ఎండగట్టాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదలలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అందుకు అసెంబ్లీని వేదికగా మలుచుకోవాలని తలుస్తున్నారు. అనంతరం జిల్లాలో బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. బీజేపీ తీరును జనాల్లోకి తీసుకెళ్ళి మరోసారి సెంటిమెంట్ రగిల్చి రాజకీయం చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది.
మార్చిలో అసెంబ్లీ రద్దు
మార్చిలోపు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ఓ కొలిక్కితీసుకురావాలని కేసీఆర్ భావిస్తున్నారు. మార్చిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించి ముగిసిన వెంటనే అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉందనే విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే దేశ రాజకీయాలపై ఫోకస్ ను కేసీఆర్ తగ్గించినట్లు తెలుస్తోంది.
1 Comment
Pingback: షర్మిలకు ప్రధాని ఫోన్ - బీజేపీ - వైఎస్సార్ టీపీ పొత్తు..? - Polytricks.in