ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల వ్యవధిలోనే సోదరుడు, తల్లి, తండ్రి ఇలా ఒక్కొక్కరు కాలం చేయడంతో మహేష్ బాబు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. తన తండ్రి మరణంపై మహేష్ బాబు తాజాగా భావోద్వేగ లేఖ వెలువరించారు.
నాన్నా.. మీ జీవితం చరితార్ధమైంది. మీ వీడ్కోలు మరింత వైభవంగా జరిగింది. అదంతా మీ గొప్ప దనం. మీరు మీ జీవితంలో ధైర్యం కోల్పోకుండా జీవించారు. డేరింగ్ అండ్ డాషింగ్ మీ నైజం. నా స్ఫూర్తి , నా గుండె ధైర్యం అన్ని మీతోనే పోయానని అనుకున్నాను.
కానీ, ఇదివరకు లేనంతగా గుండెధైర్యం నాలో కల్గింది నాన్నా.ఇప్పుడు నాకు భయం లేదు నాన్న.మీ ఆశీస్సులు నాపై ఉన్నంత కాలం మీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తా. మీరు ఎక్కడున్నా గర్వపడేలా చేస్తా.. లవ్యూ నాన్న అంటూ ట్విట్టర్ లో లెటర్ ను పోస్ట్ చేశాడు మహేష్ బాబు.
— Mahesh Babu (@urstrulyMahesh) November 24, 2022