విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మించిన వారసుడు సినిమాపై వివాదం నెలకొన్నది. ఈ సినిమాను తెలుగులోనూ, అటు తమిళ్ లో సంక్రాంతికి విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావించగా.. తెలుగు సినీ నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయంతో ఈ సినిమా రిలీజ్ కు బ్రేక్ పడినట్లు అయింది.
ఈ సంక్రాంతికి తెలుగులో డబ్బింగ్ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వొదని తెలుగు సినీ నిర్మాతల మండలి తాజాగా తీర్మానించింది. ఇందుకు సంబంధించి లేఖను కూడా విడుదల చేశారు. దీంతో వారసుడు సినిమా రిలీజ్ పై సస్పెన్స్ నెలకొనడంతోపాటు తెలుగు ప్రొడ్యూసర్ తీర్మానంపై తమిళ్ సినీ దర్శకులు తీవ్రంగా మండిపడుతున్నారు.
తీవ్ర అనారోగ్యానికి గురైన పంచ్ ప్రసాద్ – కంటతడి పెట్టిస్తోన్న వీడియో
తమిళనాడులో ఎలాంటి ఆటంకాలు లేకుండా తెలుగు డబ్ సినిమాలు విడుదల అవుతున్నాయని.. తెలుగులో మాత్రం తమిళ్ సినిమాలను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలుగు సినీ నిర్మాతల మండలి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే తాము కూడా తెలుగు సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
దర్శకుడు , నిర్మాతలిద్దరూ తెలుగు వారు. హీరో మాత్రమే తమిళ్ హీరో కాని అయినప్పటికీ తెలుగు సినీ నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకోవడం హట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై ఇప్పటివరకు దిల్ రాజు స్పందించకపోవడం గమనార్హం.