విజయ్ దేవరకొండ హీరోగా స్టార్ డైరక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం లైగర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా ఇప్పటికీ చర్చలో నానుతూనే ఉంది. ఈ సినిమా చుట్టూ రాజకీయాలు ముసురుకుంటున్నాయి.
లైగర్ సినిమా నిర్మాణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ పెట్డుబడులు పెట్టిందని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఈడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాక్ మనీని వైట్ చేసుకునేందుకు లైగర్ సినిమాలో పెట్టుబడులు పెట్టిందని ఆయన ఆరోపించారు. ఇందుకు సంబంధించి తన దగ్గర సమాచారం ఉందని చెప్పడం సంచలనంగా మారింది.
లైగర్ సినిమా నిర్మాతలుగా చార్మి, కరణ్ జోహార్ లు వ్యవహరించారు. కాని వీరు మాత్రమే కాదు కవిత కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అంటూ బక్క జడ్సన్ ఈడీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సినిమాలో కవిత మాత్రమే పెట్టుబడులు పెట్టిందా..? ఇంకా మరెవరైనా పెట్టుబడులు పెట్టారా అనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.
లైగర్ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా కావడంతో కవిత పెట్టుబడులు పెట్టి ఉండొచ్చునని సందేహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందించే సినిమాలకు తెర వెనక ఉండి పెట్టుబడులు పెట్టేవారు చాలామందే ఉంటారు.. ఇప్పుడు లైగర్ విషయంలోనూ అలానే జరిగి ఉండొచ్చునని అంటున్నారు. ఈ వ్యవహారంలో కవితను విచారణకు రావాలని నోటిసులు పంపే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో ఈ విషయం పట్ల జనాల అటెన్షన్ పక్కదోవ పట్టించేందుకు అరవింద్ – కవితల డ్రామా జరిగి ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
మరోవైపు, విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా జనగణమన సినిమాను మై హోం సంస్థ నిర్మిస్తుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.