తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న నూతన సచివాలయం మరో రెండు నెలలో పూర్తి కానుంది. గురువారం సెక్రటేరియట్ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పరిశీలించారు. అనంతరం పలు సూచనలు చేశారు. నాణ్యతలో రాజీ పడకుండా త్వరగా అందుబాటులోకి వచ్చేలా నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. దాదాపు పూర్తి కావొచ్చిన సెక్రటేరియట్ పనులను మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇంకో రెండు నెలలో సచివాలయం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
సచివాలయానికి రాని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది తెలంగాణ సీఎం మాత్రమేనని ప్రతిపక్షాలు విమర్శించినా పట్టించుకోని కేసీఆర్ , కేటీఆర్ లు నూతన సచివాలయ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం హాట్ టాపిక్ గా మారింది. సీఎం ఎక్కడుండి పని చేస్తే ఏంటని ప్రశ్నించిన కేటీఆర్.. ఇప్పుడు సెక్రటేరియట్ పై నిర్మాణం విషయంలో స్పెషల్ కేర్ తీసుకుండటంతో కేటీఆర్ కు సీఎం చైర్ అనే ప్రచారం మరోసారి తెరమీదకు వచ్చింది. నూతన సచివాలయం ప్రారంభం కాగానే కేటీఆర్ కు సీఎం బాధ్యతలు అప్పగిస్తారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
రాజకీయాల్లోకి పోలీసు బాస్ మహేందర్ రెడ్డి..?
ఇదివరకున్న సచివాలయం వాస్తుదోషంతో ఉందని..దాంట్లో పరిపాలన చేస్తే టీఆర్ఎస్ కు అధికారం దక్కదనే వాస్తు నిపుణుల సూచన మేరకే నూతన సచివాలయ నిర్మాణం కేసీఆర్ చేపట్టారని అంటున్నారు. పండితుల సూచనల మేరకు ఎలాంటి వాస్తు దోషం లేకుండా సెక్రటేరియట్ నిర్మాణం జరిగినట్లు చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నూతన సచివాలయం వేదికగా కేటీఆర్ కు పట్టాభిషేకం జరగనుందని.. అందుకే తండ్రి, కొడుకులు సచివాలయ నిర్మాణంలో కేర్ తీసుకుంటున్నారని చెప్తున్నారు.
మరోవైపు.. బీఆర్ఎస్ కు వచ్చే నెలలో అనుమతి లభిస్తుంది. పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలంటే కేసీఆర్ అధిక సమయం దేశ రాజకీయాలకే కేటాయించాల్సి ఉంటుంది. సంక్రాంతివరకు సచివాలయం అందుబాటులోకి వస్తే కేటీఆర్ ను సీఎం చేసేసి.. తన కార్యక్షేత్రాన్ని ఢిల్లీకి మార్చాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారన్న విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి.