లిక్కర్ స్కాంలో తన కూతురు కవితను సేవ్ చేసుకునేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మార్గం దొరికిందా..? ఇక , ఈ కేసులో కవిత అరెస్ట్ ఉండే అవకాశం ఎంతమాత్రం లేదా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
ఏదైనా అనుకుంటే సాధించి తీరుతాడని కేసీఆర్ నుద్దేశించి అంటుంటారు. ఇది ఉరికే అనలేదమో. ఎందుకంటే, ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇక కవిత అరెస్ట్ తప్పదని అంత భావిస్తుండగా..అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని కూతురి అరెస్ట్ ను కేసీఆర్ అడ్డుకోగలిగారు. భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించిన సమయంలో బీజేపీతో చేసుకున్న ఒప్పందంతో కూతుర్ని అరెస్ట్ గండం నుంచి బయటపడేశారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ఊహించిన దానికంటే రెట్టింపు ఆదరణ రావడం టీఆర్ఎస్ , బీజేపీలకు కంటగింపుగా మారింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఒప్పందంలో భాగంగా వారానికో అరెస్ట్ చూపించి మీడియా అటెన్షన్ ను గ్రాఫ్ చేసుకోగలిగారు. దాంతో రాహుల్ గాంధీ చేసే ప్రజాకర్షక హామీలు ప్రజలకు చేరువ కావని అంచనా వేసిన కమలనాథులు తమదైన శైలిలో వ్యూహం రచించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడితే బీజేపీకి స్కోప్ ఉండదని అంచనా వేసి లిక్కర్ స్కాంలో ఎదో జరగబోతుందని అభూత కల్పనలు క్రియేట్ చేసి మీడియా దృష్టిని తమవైపు రాబట్టుకోగలిగాయి.
దీంతో ఆందోళనకు గురైన కేసీఆర్ ఢిల్లీ పెద్దలతో అంతర్గతంగా మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో బీజేపీకి , కేసీఆర్ కు మధ్య జరిగిన సంబాషణలో రాహుల్ జోడో యాత్రకు ఆదరణ రాకుండా కట్టడి చేసే అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. రాహుల్ యాత్ర సక్సెస్ అవుతే రాష్ట్రంలో రెండు పార్టీల ఉనికికి ప్రమాదమని అంచనా వేసిన కేసీఆర్.. బీజేపీ విధించిన షరతుకు అంగీకరించారని అందుకు బహుమానంగా లిక్కర్ స్కాంలో కవిత పేరును తప్పించనున్నారని టాక్.