మునుగోడు ఉప ఎన్నిక ఓటమిపై ప్రజా శాంతి పార్టీ అద్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉప ఎన్నికను రద్దు చేసి మరోసారి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్ లతో ఎన్నికను నిర్వహించాలన్నారు.
పోలింగ్ రోజున ఈవీఎంలు మార్చారనే విషయం అధికారులకు సైతం తెలుసునని వ్యాఖ్యానించారు. పోలింగ్ జరిగిన మరుసటి రోజే కౌంటింగ్ నిర్వహించాలని తాను పట్టుబట్టినా ఎందుకు ఆపని చేయలేదని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపించారు. ఈ నెల 10న ఢిల్లీ వెళ్తున్నానని.. ఈ విషయంపై అక్కడే చర్చిస్తానని పేర్కొన్నారు.
మంగళవారం మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ మంత్రి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. ఇంకెంతకాలం నీ డ్రామాలు…నీ ప్రలోభాలు, ఇంకెంతకాలం మోసం చేస్తావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనిల్ రెడ్డితో దాడి చేయించినా తాను భయపడనని..కొట్లాడుతునే ఉంటానని స్పష్టం చేశారు.