టీ. టీడీపీ రాష్ట్ర అద్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ను నియమించారు ఆ పార్టీ జాతీయాద్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఇటీవలే పార్టీలో చేరిన ఆయనకు రాష్ట్ర అద్యక్ష బాధ్యతలు కట్టబెట్టడుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర అద్యక్షుడిగా కొనసాగిన బక్కని నరసింహులును పోలిట్ బ్యూరోలోకి తీసుకోవడమే కాకుండా జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు కూడా అప్పగించారు.
ఎల్. రమణ టీఆర్ఎస్ లో చేరాక బక్కని నరసింహులకు పార్టీ అద్యక్ష బాధ్యతలను అప్పగించినా పార్టీలో ఏమాత్రం జోష్ నింపలేకపోయారు. టీఆర్ఎస్ వైఫల్యాలను జనాల్లోకి తీసుకెళ్ళడంలో ఆయన విఫలమయ్యారు. దీంతో పూర్తిగా టీడీపీ ఉనికి ప్రశ్నార్థకం అయ్యే స్థితికి చేరుకుంది. ఈ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపుతోపాటు ఆర్థికంగా బలవంతుడైన కాసాని జ్ఞానేశ్వర్ పార్టీలో చేరడంతో ఆయనే చంద్రబాబుకు రైట్ ఛాయిస్ అయ్యారు. మరీ, కాసాని హయంలోనైనా తెలంగాణలో టీడీపీ తలరాత మారుతుందో చూడాలి.
తెలంగాణ అనే సెంటిమెంట్ ను టీఆర్ఎస్ వదిలేయడంతో టీడీపీ ఆంధ్రా పార్టీ అనే ముద్రను చేరిపెసుకునే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం ప్రాంతాల్లో మంచి ఓటు బ్యాంక్ కల్గిన టీడీపీ వచ్చె ఎన్నికల్లో కాసాని నేతృత్వంలో ఏమేరకు సీట్లు సాధిస్తుందో.