ఇండియన్ కరెన్సీపై అంబేడ్కర్ చిత్రాన్ని ముద్రించాలని డిమాండ్లు వస్తున్నా వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొత్త వాదన ముందుకు తీసుకొచ్చారు. భారత కరెన్సీపై ఓ వైపు గాంధీ చిత్రాన్ని అలాగే ఉంచి, మరోవైపు గణేశుడు, లక్ష్మీదేవి చిత్రాలను ముద్రించాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం చేసిన ఈ వాదన బీజేపీ అవలంభించే సిద్దాంతాలకు అనుకూలంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి.
బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ బీ- టీమ్ అని విమర్శలు ఉన్నాయి. యూపీఏ హయంలో అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ లు అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ డైరక్షన్ లో ఉద్యమించినట్లు వీరిపై కంప్లైంట్స్ ఉన్నాయి. యూపీఏ హయంలో అవినీతి, అవినీతి అంటూ గొంతు చించుకొని మరీ అరచిన ఈ ఇద్దరు నేతలు, బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతి అక్రమాలపై గొంతెత్తిన దాఖలాలు లేవు. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ అవసరాల కోసం బీజేపీపై అడపాదడప విమర్శలు చేస్తున్నారు కాని, జనలోక్ పాల్ ఉద్యమానికి నేతృత్వం వహించిన అన్నా హజారే తన లక్ష్యాన్ని పూర్తి చేసి సేదా తిరుతున్నాడు. ఇప్పుడు ఆయనగారికి ప్రజల సమస్యలు పట్టడంలేదు. బీజేపీ చేస్తోన్న అన్యాయం కనిపించడం లేదు. ఈ ఇద్దరు బీజేపీ అనుకూలురే. ఇందులో భాగంగానే అంబేడ్కర్ చిత్రాన్ని భారత నోట్లపై ముద్రించాలన్న డిమాండ్ కు కౌంటర్ గా గణేశుడు, లక్ష్మి దేవి చిత్రాలను ముద్రించాలన్న డిమాండ్ ను బీజేపీ చేస్తే ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. దాంట్లో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ ను బీజేపీ రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.
అంబేడ్కర్ సూచనల మేరకు “రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా” ఏర్పడిందనేది అందరికీ తెలిసిందే. అలాంటిది అంబేడ్కర్ కృషికి ఏమాత్రం విలువనీయకుండా, చరిత్రను కప్పెసేందుకు వీలుగా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. శాశ్వతంగా అంబేడ్కర్ ను ప్రజల నుంచి దూరం చేసేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కరెన్సీకి మరోవైపు గణేశుడు, లక్ష్మీదేవి ఫోటోలను ముద్రించాలని బీజేపీ సిద్దాంతాలను విశ్వసించే అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.