ఈ ఏడాది అంతర్జాతీయ ఆకలి సూచిలో భారత్ మరింత దిగజారింది. 121 దేశాలతో రూపొందించిన ఈ సూచీలో భారత్ 107స్థానానికి పడిపోయింది. గతేడాది 101 ర్యాంక్ దక్కించుకున్న భారత్… ఈ ఏడాది మాత్రం ఏకంగా 6 స్థానాలు దిగజారింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… పాక్ , బంగ్లాదేశ్, నేపాల్ భారత్ కంటె మెరుగైన స్థితిలో ఉండటం గమనార్హం. ఆకలి, పౌష్టికాహారం లను ఆధారంగా చేసుకొని ఈ ఆయా దేశాల ఆకలి సూచిని నిర్ణయిస్తారు. ఈమేరకు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెబ్ సైట్ రూపొందించిన నివేదికలో ఇండియాలో ఆకలి స్థాయి చాలా తీవ్రంగా ఉందని.. ఇదే విధంగా కొనసాగితే భారత్ లో ఆకలి చావులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
జీహెచ్ఐలో ఇండియా స్థానం పతనం అవ్వడంపై కాంగ్రెస్ స్పందించింది. నరేంద్ర మోడీ అభివృద్ధి ఇదేనా విమర్శలు గుప్పించింది. మోడీ భారత్ ను ఆకలి చావుల వైపు తీసుకెళ్తున్నారని మండిపడుతున్నారు.