బీసీసీఐ అద్యక్షుడిగా సౌరవ్ గంగూలీని తప్పించారు. మరోసారి బీసీసీఐ అద్యక్షుడిగా కొనసాగేందుకు గంగూలీ ఆసక్తి కనబరిచినా దాదాకు నిరాశే ఎదురైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడికి బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగేందుకు మరో దఫా అవకాశం ఇచ్చి..దాదాను సైడ్ చేయడం విమర్శలకు దారితీస్తోంది. అయితే, గంగూలీకి బీసీసీఐ అద్యక్షుడిగా మరో అవకాశం ఇవ్వకపోవడానికి ఆయన బీజేపీలో చేరేందుకు నిరాకరించడమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పశ్చిమ బెంగాల్ కు చెందిన గంగూలీకి బీజేపీ రాష్ట్ర అద్యక్ష బాధ్యతలను అప్పగించాలని అమిత్ షా భావించారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల సమయంలో రేసులోనున్న సువెందు అధికారిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో గంగూలీని బీజేపీలో చేరాలని మే లో గంగూలీ నివాసానికి వెళ్లి అమిత్ షా ఆహ్వానించారు. రాజకీయల్లోకి రావడం ఇంట్రెస్ట్ లేదని గంగూలీ షా ఆహ్వానాన్ని తిరస్కరించడమే దాదా బీసీసీఐ పోస్ట్ కు ఎసరు తెచ్చిందని అంటున్నారు పరిశీలకులు.
రోజర్ బిన్నీబీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా, అమిత్ షా తనయుడు జై షా రెండోదఫా కార్యదర్శిగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజీవ్ శుక్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగనున్నారు. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు, ప్రస్తుత కోశాధికారి అరుణ్ కుమార్ ధుమాల్ ఐపీఎల్ పగ్గాలు చేపట్టనున్నాడు. బ్రిజేష్ పటేల్ స్థానంలో ఐపీఎల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. మహారాష్ట్ర బీజేపీ నాయకులు ఆశిష్ షెలార్ కోశాధికారి పదవిని చేపట్టనున్నారు. బీసీసీఐని కూడా బీజేపీ అనుబంధ విభాగంగా మార్చుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.