తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో మకాం వేశారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ అంత్యక్రియల్లో పాల్గొన్న కేసీఆర్ అక్కడి నుంచి నేరుగా హస్తినకు వెళ్ళడం హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన అనూహ్యంగా ఢిల్లీలో వాలిపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల సీబీఐ అరెస్ట్ చేసిన అభిషేక్ రావుకు టీఆర్ఎస్ కీలక నేతలతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సీబీఐ కస్టడీలో అబిషేక్ కీలక విషయాలు చెప్తే నెక్స్ట్ టీఆర్ఎస్ బడా నేతలకు లిక్కర్ స్కాంలో నోటిసులు అందే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మార్చేందుకు హస్తినలో జరిగిన భేటీలో కేసీఆర్ తనయ ఎమ్మెల్సి కవిత పాల్గొన్నారని.. అందులో భాగంగానే ఆమెకు ఫ్లైట్ బుక్ చేసింది అభిషేక్ రావేనని సీబీఐ అధికారులు గుర్తించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అభిషేక్ కస్టడీ ముగిసిన తరువాత కవితతోపాటు ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు కూడా ఈడీ నోటిసులు అందే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. అందుకే ఈ విషయంపై టీఆర్ఎస్ నేతలు పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదని…నోటిసులు రాకుండా అడ్డుకునేందుకు తెరవెనక కేసీఆర్ ప్రయత్నాలు చేశారని కాని బీజేపీ అధినాయకత్వం టచ్ లోకి రాకపోవడంతో కేసీఆర్ తన ప్రయాణాన్ని యూపీ నుంచి హస్తిన వైపు మళ్ళించారనే ఆరోపణలు వస్తున్నాయి.
లిక్కర్ స్కాంలో కవితను సేవ్ చేసేందుకు కేసీఆర్ ఢిల్లీ వెళ్ళారంటున్నారు. అక్కడే మరికొన్ని రోజులు ఉండి నోటిసులు రాకుండా చూసేందుకు లాబీయింగ్ చేయబోతున్నారని చెబుతున్నారు. అందుకే తనతోపాటు కవిత ను కూడా వెంట తీసుకెళ్లారని ఉదహరిస్తున్నారు. లిక్కర్ స్కాంలో కవితకు త్వరలోనే ఈడీ నోటిసులు అందుతాయని ధీమాగా చెప్తున్నారు. ఒకవేళ కొద్ది రోజుల తరువాత కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు కవితను విచారణకు ఆదేశించికపోతే కేసీఆర్ తాజా ఢిల్లీ టూర్ లో లాబీయింగ్ జరిగి ఉంటుందనే ఆరోపణలకు బలం చేకూరినట్లే అవుతుంది. చూడాలి మరి ఎం జరుగుతుందో..!