తెలంగాణ బీజేపీలో ముసలం ఏర్పడింది. బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ప్రయోగాత్మకంగా చేసిన ఓ ప్రయోగం వికటించి పార్టీలో కూనిరాగాలకు కారణమైంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 119నియోజకవర్గాలకు ఇంచార్జ్ లను బండి సంజయ్ ప్రకటించారు. ఈ ఇంచార్జ్ లు ఎవరు స్థానిక నేతలు కాదు. ఇతరులను నియోజకవర్గ ఇంచార్జ్ లుగా నియమించడం ఆ పార్టీ నేతల ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది.
నియోజకవర్గ ఇంచార్జ్ లుగా నియమించబడ్డ వారెవరికీ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వరని కూడా పేర్కొన్నారు. కేవలం ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ అధినాయకత్వం బాధ్యతలను కట్టబెట్టింది. నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోయే వారి గెలుపు కోసం పని చేయాలని ఇంచార్జ్ లకు వర్క్ ను అప్పగించారు. దీంతో ఈ 119నియోజకవర్గాలకు ఇంచార్జ్ లుగా నియామమైన వారంతా ఈ ఇంచార్జ్ పోస్టులు తమకు వద్దు బాబోయ్ అంటూ బండికి లేఖలు రాస్తున్నారు.
సరిగ్గా.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా.. తమకు టికెట్ దక్కుతుందని ఏర్పాట్లు చేసుకుంటుంటే ఈ దిక్కుమాలిన పదవులు కట్టబెట్టి తమ రాజకీయ భవిష్యత్ ను ఆగమాగం చేయాలనీ బండి సంజయ్ భావిస్తున్నారా..? అని ఇంచార్జ్ నేతలు రాష్ట్ర నాయకత్వంపై ఫైర్ అవుతున్నారు. ఆయన సీఎం సీటు కోసం మనం త్యాగాలు చేయాలా అంటూ నేతలు చర్చించుకుంటున్నారు. కేసీఆర్ కు బండి సంజయ్ కు పెద్దగా తేడా లేకుండా పోయిందని.. ఇన్నాళ్ళు బండి సంజయ్ వెనక నడిచినందుకు సన్నిహితులైన మనల్నే మోసం చేస్తాడా అంటూ నిట్టూరుస్తున్నారు బీజేపీ నేతలు.