రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (RFCL) ఎరువుల కర్మాగారం. 1999 మార్చి 31న అర్ధరాత్రి మూతపడ్డ కర్మాగారాన్ని 2014 లో ఏర్పడిన నరేంద్ర మోదీ ప్రభుత్వం చొరవతో సుమారు రూ.5,254 కోట్ల అంచనాలతో నిర్మాణం పనులు చేపట్టగా… కరోనా సహా వివిధ కారణాల వల్ల నిర్మాణంలో జాప్యం జరగడం వల్ల వ్యయం రూ.6,120కోట్ల 55 లక్షలతో రామగుండం ఎరువుల కర్మాగారం పునః ప్రారంభమైంది.
అయితే ఎరువుల ప్రొడక్షన్ అయిన తర్వాత ఎరువులను బ్యాగింగ్ లోడింగ్ మరియు అన్ లోడింగ్ చేసే విభాగానికి సంబంధించి లేబర్, హమాలీ పనులను పశ్చిమ బెంగాల్ కు చెందిన ఫైవ్ స్టార్ అనే కంపెనీ ఏడాది కాలానికి కాంట్రాక్ట్ దక్కించుకుంది, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్థానిక టీఆర్ఎస్ నాయకుల ద్వారా సదరు కాంట్రాక్టర్ కు 2 కోట్ల రూపాయలు గుడ్ విల్ ఇచ్చి తన బినామీలకు కాంట్రాక్ట్ పనులను ఇప్పించుకుని లేబర్, హమాలీలను పనుల్లోకి తీసుకోవడం మొదలు పెట్టాడు, అయితే లేబర్, హమాలీ ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమని నమ్మించి, నెలకు 20 వేల జీతంతో పాటు కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లు, ఉండడానికి క్వార్టర్స్ ఉంటాయని తన అనుచరుల ద్వారా దాదాపు 700 మంది నిరుద్యోగుల నుండి 6 లక్షల నుండి 12 లక్షల వరకు డబ్బులు వసూలు చేసి చేతులు ఎత్తేసాడు, ఉద్యోగాల పేరుతో 40 కోట్ల కుంభకోణం జరిగి దాదాపు 3 నెలలు గడుస్తున్న, రామగుండం నియోజకవర్గం మొత్తం కోడై కూస్తున్న, బాధితులు నిరసనలు తెలుపుతున్న అటు పోలీసులు ఇటు మీడియా చోద్యం చూస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎరువుల కర్మాగారంలో పర్మినెంట్ ఉద్యోగాలు అనేసరికి అప్పులు చేసి కొందరు, ఆస్తులు కుదువ పెట్టి కొందరు, పొలాలు, భూములు అమ్ముకొని కొందరు లక్షల రూపాయలు తెచ్చి ఎమ్మెల్యే అనుచరులకు ధారపోశారు, డబ్బులు చెల్లించి నెలలు గడుస్తున్న ఉద్యోగాలు రాకపోవడంతో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇంటిముందు ప్రతిరోజు బాధితులు నిరీక్షణ చేస్తున్నారు, ఎమ్మెల్యే స్పందించకపోవడంతో బాధితులు ఎమ్మెల్యే వాహనానికి అడ్డంగా పడుకుంటే తన అనుచరులతో భౌతిక దాడులు చేయిస్తున్నాడు.
నోట్ల కట్టలతో పోలీసుల, మీడియా నోళ్లు మూయించి బాధితులను పట్టించుకునే నాథుడే లేకుండా చేసాడు ఎమ్మెల్యే కోరుకంటి చందర్.
తెలంగాణ రాష్ట్రంలో యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోగా, లేబర్, హమాలీ లాంటి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలాంటూ నిరుద్యోగ యువతి యువకులను నమ్మబలికి 40 కోట్లు వసూలు చేసిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను ప్రశ్నిస్తే తాను ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడినని, వారి ముఖ్య అనుచరుడినని తనను ఎవరు ఏమి చేయలేరని, మీ దిక్కున్న చోటికి వెళ్లి చెప్పుకోండని బాధితులను బెదిరిస్తున్నాడు.
అప్పులు చేసి ఆస్తులు అమ్ముకుని డబ్బులు కట్టిన బాధితుల్లో కొందరు తమకు న్యాయం జరగదని ఇక ఆత్మహత్యే శరణ్యమని గుండెలు బాదుకుంటున్నారు.
ఈ సోషల్ మీడియా ద్వారా నెట్టిజన్స్ స్పందించి బాధితులకు న్యాయం జరిగేవరకు, ప్రభుత్వం స్పందించే వరకు ఆ నిరుద్యోగ బాధితులకు న్యాయం జరిగేవరకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాం.