ఈ రోజు TJS పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ విలేకరుల సమావేశం నిర్వహించారు..
ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతు క్రిష్ణ జలాల పరిరక్షణ యాత్ర వచ్చే నెల 4 వ తేదీన నుండి నల్గొండ జిల్లా ఉదయ సముద్రం నుండి నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని బ్రమ్మన వెళ్లెముల ప్రాజెక్టు,మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చర్ల గూడేo ప్రాజెక్టు,డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు, దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని SLBC టన్నెల్ నక్కల గండి ప్రాజెక్టు వరకు ఈ యాత్ర కొనసాగుతుంది .
ఈ యాత్ర లో ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు,కేంద్ర ప్రభుత్వం తెచ్చిన krmb గెజిట్ వెంటనే రద్దు చేయాలని మరియు క్రిష్ణ పెండింగ్ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం సత్వరం పూర్తిచేయాలని కోదండరామ్ డిమాండ్ చేశారు,మరియు 2వ గోదావరి జలాల సాధన యాత్ర కామారెడ్డి జిల్లాలో కొనసాగుతుంది ఎందుకంటే 8000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వాలు 22 వ ప్యాకేజి కింద కాలువలు తవ్వి నారు ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో, రైతులకు సాగు నీరు లేక బోర్లు వేసి అప్పుల ఊబిలో చిక్కుకొని దుబాయ్ ల పాలై చనిపోతున్నారు, కామారెడ్డి జిల్లాలో యాత్ర చేస్తామని తెలిపారు, జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని నీంజు పేరుతో భూముల గుంజుకొని ప్రభుత్వం రైతుల ను పట్టించుకోవడం లేదని ఇది దారుణం అన్నారు, జహీరాబాద్ లో 3 వ విడత యాత్ర ఉంటుందని తెలిపారు,
Kcr ప్రభుత్వం ఉద్యోగాలు వేస్తామని ప్రకటించి నెలగడుస్తున్నా ఇప్పటి వరకు నోటిఫికేషన్లు వేయకపోవడం సిగ్గుచేటు అని అన్నారు,కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూ సామాన్యులనుకు బ్రతుకు భారం అవుతుందని వెంటనే ధరలు పెరుగుదల నియంత్రించాలని పెట్రోల్ డీజిల్ ను GST పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు,నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి రాష్ట్రంలో పేద ప్రజలకు ఇబ్బంది అవుతుందని నిత్యావసర సరుకులు పేద ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు,కరెంట్ బిల్లులు,బస్ చార్జీలు పెంచారు,వీటిని నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు ఈ నెల 25,26 తేదీలలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ రోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు, ఇందులో భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చ నిర్వహించారు, సోషల్ మీడియా ప్రతినిధులు చేయాల్సింది కూడా చర్చలు జరిగాయి, ఈ విలేకరుల సమావేశంలో TJS ఉపాధ్యక్షులు PL విశ్వేశ్వర్ రావ్,గంగపురం వెంకట్ రెడ్డి, రాజా మల్లయ్య, ప్రధాన కార్యదర్శిలు కుంట్ల ధర్మజున్, బైరి రమేష్,గోపాగాని శంకర్రావు, నిజ్జన రమేష్,మొగుడంపల్లి ఆశప్ప,అధికాప్రతి నిధులు పల్లె వినయ్ కుమార్, డోలి సత్యనారాయణ,రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మరబోయిన శ్రీధర్ ,శివకుమార్ మహిళా జన సమితి అధ్యక్షులు రావుల లక్ష్మీ, వి మమత,యువజన సమితి అధ్యక్షులు సలీO పాషా,విద్యార్థి జన సమితి అధ్యక్షులు బాబు మహాజన్,ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్,భద్రాగమ ఆంజనేయులు,SC సెల్ అధ్యక్షులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.