జాతీయ పార్టీగా టి.ఆర్.ఎస్ ..
ఎప్పుడు ఏదో సంచలనం చేస్తూ దేశ వ్యాప్త గుర్తింపు కోసం ఆరాటపడుతుంటారు తెలంగాణ సీ.ఎం కె.సీ.ఆర్ అన్నది ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతుంటారు.
ఏది చేసినా తన రాజకీయ వ్యూహంగా కె.సీ.ఆర్ ఏకచక్రాధిపత్యంగా పార్టీని నడిపిస్తున్నారు కె.సీ.ఆర్ కుటుంబీకుల్లో పార్టీ ల్యాభియింగ్ చేస్తారని ప్రచారం ఉన్నా కె.సీ.ఆర్ నిర్ణయమే పైనల్ అన్నది పలు సందర్బాల్లో తెలిసిన విషయమే. రెండు దశాబ్దాల గులాభీ పార్టీ ప్రస్దానంలో కె.సీ.ఆర్ ఎన్నో అటు పోట్లు చవిచూశారు. తన పని అయిపోయింది .
అనుకున్నప్పుడల్లా ఫామ్ హౌజ్ పాలిటిక్స్ తో సైలెంట్ పాలిటిక్స్ సాగిస్తూ అధికారాన్ని రెండు పార్లు దక్కించుకున్నారు కె.సీ.ఆర్. 20 ఏళ్లుగా కె.సీ.ఆర్ వన్ మ్యాన్ షో ను జాతీయ స్దాయిలో చక్రం తిప్పేలా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ లో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేలా తన సంక్షేమ ఫార్మూలాను ప్రకటించనున్నారని తెలుస్తుంది. ఇక పెఢరల్ ఫ్రంట్ ఏర్పాటు తీరని కలగా మారుతుండడంతో టి.ఆర్.ఎస్ పార్టీనే జాతీయ పార్టీగా ప్రకటించి ఢీల్లీలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా కె.సీ.ఆర్ నిలవాలని భావిస్తున్నట్లు సమాచారం.