• Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

What's Hot

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026
Facebook Twitter YouTube WhatsApp
Polytricks.in
  • About
  • Editorial Policy
  • Our Authors
  • Contact
Facebook Twitter YouTube WhatsApp
YouTube
  • Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help
Polytricks.in
Home » కో..అంటే కోకాపేట..తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ జోష్‌ ఎకరం రూ. 150 కోట్లు పలికిన భూమి
News

కో..అంటే కోకాపేట..తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ జోష్‌ ఎకరం రూ. 150 కోట్లు పలికిన భూమి

Polytricks DeskBy Polytricks Deskనవంబర్ 29, 2025వ్యాఖ్యలు లేవు2 Mins Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

తెలంగాణలో రియల్‌ ఎస్టేట్ రంగం పుంజుకుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుస ఎన్నికలతో హైదరాబాద్‌తో పాటూ రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం జోరు కాస్త తగ్గింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న అభివృద్ధితో గత ఏడాదిగా రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెడుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వేలంలో ప్రభుత్వ భూములకు డిమాండ్ ఆకాశాన్ని అంటుతోంది.

ఇప్పటికే ఎకరం 177 కోట్లు పలుకగా…తాజాగా హెచ్ఎండీఏ నిర్వహించిన వేలంలో కోకాపేట నియోపోలిస్ లే అవుట్ లో ఎకరం భూమి 151.25 కోట్లు పలికింది. మొత్తం రెండు ప్లాట్లు వేలం వేయగా…ప్రభుత్వానికి ఏకంగా రూ.1352 కోట్లు వచ్చి ఖజానాలో పడ్డాయి. ప్లాట్ నెంబర్ 15లో 4.03 ఎకరాలుండగా ఎకరా 151.25 కోట్ల చొప్పున మొత్తం రూ.609.5 కోట్లకు GHR అర్బన్ బ్లాక్స్ & లక్ష్మీ ఇన్‌ఫ్రాకు చెందిన గుమ్మడి లక్ష్మీనారాయణ దక్కించుకున్నారు. ఇక రెండో ప్లాట్ అయిన ప్లాట్ నెం.16న హైదరాబాద్‌లో ఈ మధ్ విస్తరిస్తున్న గోద్రెజ్ ప్రాపర్టీస్ కొనుగోలు చేసింది. మొత్తం 5.03 ఎకరాలుండగా ఎకరాకు రూ.14.75 కోట్ల చొప్పున రూ.743 కోట్లకు ప్లాట్ నెంబర్ 16ను గోద్రెజ్ ప్రాపర్టీస్ దక్కించుకుంది. ఇక్కడ ఎకరాకు ప్రారంభ ధర రూ.99 కోట్లుగా నిర్ణయించారు. కానీ 50 శాతం ఎక్కువ ధరకు భూమిని దక్కించుకునేందుకు కంపెనీలు పోటీ పడ్డాయి.

కొద్ది నెలల క్రితం రాయదుర్గంలో టీజీఐఐసీ భూముల్లో ఎకరాకు రూ.177 కోట్లు పలికింది. అయితే 2023లో జరిగిన నియోపొలిస్ ఆక్షన్లలో సగటు ధర ఎకరాకు సుమారు రూ.73 కోట్లు మాత్రమే పలికింది. ప్రస్తుత ఫలితాలు భూ విలువల్లో 87శాతం పెరుగుదలతో ఎకరాకు రూ.150 కోట్లకు పైగా పలకడం విశేషం. ఈ ధరలు నియో పొలిస్ లేఅవుట్ పై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకాన్ని చూపిస్తున్నాయి. ఈ రెండు ప్లాట్ల వేలంతో ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆదాయం వస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో నిజం లేదని మరోసారి రుజువైంది.

HMDA hyderabad Hyderabad Real Estate kokapet lands auction kokapet neopolis kokapet neopolis auction kokapet neopolis lands aution Kokapet Record Land Prices kokpet lands lands auction Neopolis lands in Kokapet Neopolis Phase-2 Auction Revanth Reddy
Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Polytricks Desk

Polytricks Desk publishes news updates and public-interest coverage focused on Telangana and Andhra Pradesh politics, governance and current affairs.

Related Posts

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

Comments are closed.

Don't Miss

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 20260

మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ Graduate MLC నియోజకవర్గంలో తాజా పబ్లిక్ రిపోర్టెడ్ Form-18 దరఖాస్తులు 94,059. 2021లో 5.17 లక్షల electorateతో పోలిక, కాంగ్రెస్ 43 observers–7 లక్షల target, BRS mobilisationతో PolyTricks విశ్లేషణ.

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • YouTube
  • WhatsApp
Our Picks

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Facebook Twitter YouTube WhatsApp
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks.in. All rights reserved.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version