కొడంగల్ భూసేకరణ విషయంలో తొందరపడి బీఆర్ఎస్ కోయిల ముందే కూసింది. కోట్లు ఖర్చు చేసి వేసిన ప్లాన్ వర్కవుట్ అయిందని సంబురాలు చేసుకున్నారు కేటీఆర్ అండ్ బ్యాచ్. కొడంగల్ అభివృద్దిని అడ్డుకున్నామని ఆనందంతో తబ్బిబ్బయ్యారు. అయితే అసలు కథ తెలిసి ఉసూరుమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన షాక్ ను తేరుకోలేకున్నారు. లగచర్ల, పోలేపల్లి, హకీంపేట్ పరిసర ప్రాంతాల్లో రానున్నది ఫార్మా కంపెనీ కాదు, ఇండస్ట్రీయల్ పార్క్ అని ఎప్పటి నుంచో ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఏడు నెలల క్రితమే ఫార్మా కంపెనీ ప్రతిపాదనను వెనక్కు తీసుకున్నట్లు అక్కడ ప్రజల్లో చాలామందికి తెలుసు. ఈ విషయాన్ని అధికారులు చెప్తూనే వచ్చారు. కానీ కోట్లు ఖర్చు పెట్టి బీఆర్ఎస్ చేసి విషప్రచారంలో ఇది చాలామంది వరకు వెళ్లలేకపోయింది.
గతంలో ఐదేళ్ల పాటూ కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిని కావాలని నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్..ఇప్పుడు అక్కడ యువతకు ఉపాధి లభిస్తుందంటే కళ్లలో నిప్పులు పోసుకుంటోంది. ఇండస్ట్రీలు వచ్చి ప్రజలు ఎక్కడ బాగుపడిపోతారో అని కడుపుమంటతో కుట్రలకు తెర తీసింది. ఇందులో భాగంగా ఫామ్ హౌజ్ నుంచి జరిగిన కుట్రలు..స్థానిక నేతలతో నడిపించిన నాటకాలు ప్రజలందరికీ తెలిసినవే. అయితే సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి కొడంగల్ అభివృద్దికి కట్టుబడి ఉన్నారు. అక్కడ డెవలప్ మెంట్ జరగాలన్నదే ఆయన అభిమతం. ఇందుకోసం ఎన్ని మెట్లు అయినా దిగేందుకు ఆయన సిద్ధం. అందుకే ఫార్మా కంపెనీపై తొలినాళ్లలో వ్యతిరేకతను అర్ధం చేసుకొని ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై ప్రజలకు కూడా స్పష్టత ఇచ్చారు. ఇప్పుడు దానిపై నోటిఫికేషన్ ఇవ్వడంతో ప్రజల్లో ఫుల్ క్లారిటీ వచ్చింది. దీంతో తమ ప్రాంత అభివృద్ధి కోసం భూములు ఇచ్చేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఇండస్ట్రీయల్ పార్కుల్లో ఎక్కువగా టెక్స్ టైల్ కంపెనీలు ఉండేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దీంతో కాలుష్యం అనే మాటే ఉండదు.
లగచర్ల అంశాన్ని పట్టుకొని కోడిగుడ్డుపై ఈకలు పీకిన బీఆర్ఎస్ నేతలకు తాజా నిర్ణయంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయింది. ఇక మనం ఎన్ని కుట్రలు చేసిన కొడంగల్ అభివృద్ధి ఆగదు అని అర్ధమైపోయింది. దీంతో టిల్లన్న ఇలాగైతే ఎలాగన్నా..స్టోరీ మొత్తం రివర్సేనా అంటూ గులాబీ నేతలు పాటలు పాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.