లగచర్ల ఘటనలో కేసీఆర్ మాస్టర్ ప్లాన్ బట్టబయలైంది. అధికారం కోల్పోయాక ఫ్రస్టేషన్ లోకి వెళ్లిన గులాబీ బాస్..ప్రజాప్రభుత్వాన్ని ఎలాగైనా బద్నాం చేయాలని కొద్దినెలలుగా ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం చేసే ప్రతిపనికి మోకాలడ్డుతున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వాన్నికూల్చేందుకు భారీ స్కెచ్ వేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో అశాంతిని రాజేసి, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భూసేకరణను అడ్డుపెట్టుకున్నారు. రైతుల్ని రెచ్చగొట్టి అధికారులపై తిరగబడేలా చేయడం, అదే సమయంతో తన కిరాయి మనుషులతో కలెక్టర్ సహా అధికారులను అంతమొందించడం వంటి కుట్రలు చేశారు.
అంతేకాదు రైతుల ముసుగులోని కొందరు కిరాయి వ్యక్తులు పోలీసులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం..కాల్పులు జరిగే సీన్ క్రియేట్ చేయాలని కూడా పథకం రచించించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు ఫామ్ హౌజ్ నుంచి గులాబీ బాస్ పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఈ మధ్య జరుగుతున్న తంతుకాదు..కొన్నినెలలుగా రేవంత్ సర్కారుపై బురదజల్లడం, గ్రామాల్లోకి పట్నం నరేందర్ రెడ్డి వెళ్లి రైతుల్ని రెచ్చగొట్టడం వంటివి చేస్తున్నారు.
కలెక్టర్ పై దాడి చేయండి…మీకు మేము అండగా ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కూడా మీకు అండగా ఉంటారని స్వయంగా పట్నం నరేందర్ రెడ్డి ఆయా గ్రామాల ప్రజలతో చెప్పిన మాటలు గాలివాటం కాదు. ముందస్తు పథకంలో భాగమే అని వరుస ఘటనలతో తెలుస్తోంది. బీఆర్ఎస్ నాయకుడు భోగమోని సురేష్ తో పాటూ మరికొందరిని ఇందులో పాత్రధారులుగా చేశారు. కలెక్టర్, ఇతర అధికారులను లగచర్లకు తీసుకువచ్చేందుకు ముందు రైతుల్ని రెచ్చగొట్టారు. రైతులు గో బ్యాక్ నినాదాలు చేస్తుండగానే బీఆర్ఎస్ కిరాయిమూకలు తమప్లాన్ అమలు చేశాయి. కొందరు అధికారులపై దాడి చేశాయి. అయితే కలెక్టర్, అధికారులు, పోలీసులు సంయమనం పాటించడంతో బీఆర్ఎస్ కుట్రలు భగ్నమయ్యాయి. లేకపోతే కలెక్టర్ సహా అధికారుల ప్రాణాలు తీసేవరకు కిరాయి మూకలు వెనుకాడేవి కాదని తెలుస్తోంది.
భోగమోని సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి 50 సార్లకు పైగా మాట్లాడటం, అదే సమయంలో కేటీఆర్ తో నరేందర్ రెడ్డి కూడా 23సార్లకు పైగా ఫోన్ కాల్స్ మాట్లాడటం ఈ కుట్ర నిజమే అనడానికి మరింత బలం చేకూరుస్తోంది. అంతేకాదు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే తమకుట్రను అమలుచేయాలని బీఆర్ఎస్ చాలా రోజులుగా వేచి చూస్తోంది. అశాంతిని రగల్చడం ద్వారా అక్కడ కాంగ్రెస్ కు రైతుల్ని దూరం చేయొచ్చు, రహస్య మిత్రులైన బీజేపీకి మేలు చేయొచ్చు. అంతేకాదు తెలంగాణలో రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రంలోని బీజేపీతో ఒత్తిడి తీసుకురావొచ్చు. ఇలా కేసీఆర్ వేసిన మాస్టర్ స్కెచ్ విఫలమవ్వడంతో ఇప్పుడు ఎలా కవర్ చేసుకోవాలో అర్ధం కాక కేటీఆర్ ఉన్నపళంగా మీడియా ముందు హడావుడి చేస్తున్నారు.