సీఎంఆర్ఎఫ్ స్కామ్ లో హరీష్ రావు పీఏ.. అంతా తెలిసే జరిగిందా..?
సీఎంఆర్ఎఫ్ స్కామ్ లో మాజీ మంత్రి హరీష్ రావు పీఏ నరేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను డ్రా చేసుకొని సొమ్ము చేసుకోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరీష్ పీఏ నరేష్ తోపాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
హరీష్ రావు దగ్గర పీఏగా పని చేసే నరేష్ సీఎంఆర్ఎఫ్ వ్యవహారాలను చూసుకునేవాడు. ఇతరులకు మంజూరైన చెక్కులను అదే పేరుతో ఉన్న వారి అకౌంట్ల వివరాలు పొందుపరిచి అక్రమంగా డబ్బును కాజేసేవాడు. ఈ బాధ్యతను ఓంకార్ అనే వ్యక్తికి అప్పజెప్పినట్లు తెలుస్తోంది. కొర్లపాటి వంశీ, బాలగోని వెంకటేష్ గౌడ్ తోపాటు ఓంకార్ కలిసి ఈ స్కామ్ చేసినట్లు సమాచారం. మొత్తం 17 చెక్కులను డ్రా చేశారు.
మెదక్ పీర్ల తండాకు చెందిన రవి సీఎంఆర్ఎఫ్ విషయమై తెలుసుకోగా అసలు విషయం బయటపడింది. తమకు రావాల్సిన డబ్బును ఇతరులు కాజేసినట్లు తేలడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు హరీష్ రావు పీఏను అరెస్ట్ చేశారు.
అయితే.. నరేష్ వ్యవహారం హరీష్ రావుకు తెలియకుండా జరిగిందా.? లేక తెలిసే జరిగిందా..? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.