సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. తాము పాలకులం కాదు…సేవకులమని ప్రమాణస్వీకార సభలో ప్రకటించిన రేవంత్ అన్నట్టుగానే సాగుతున్నారు. రేవంతన్నా అని పిలవండి చాలు.. మీ సేవకుడిగా మీ కోసం పాటుపడుతానని ప్రకటించినట్లుగానే ప్రజలకు నమ్మకం కల్గిస్తున్నారు.
ఆదివారం యశోదా ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించి రేవంత్ బయటకు వెళ్తుండగా… ఓ మహిళా రేవంతన్నా అని పిలిచింది. వెంటనే ఆమె వద్దకు వెళ్లిన రేవంత్ ఏమైందని అడగ్గా తన పాపకు ఇప్పటికే చాలా ఖర్చు అయిందని ఏడ్చుతూ చెప్పింది. వెంటనే ఏం బాధపడకు.. అంటూ వైద్యాధికారులను పిలిచి ఆ పాప వైద్యానికి సహాయం చేయాలనీ ఆదేశించారు.
నిన్నటి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెప్పినట్టుగానే సేవకుడిగా సేవలు అందిస్తున్నాడని రేవంత్ ను అభినందిస్తున్నారు.