కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు అని పెద్దల మాట. ఆ మాటలను నిజం చేసి నిరూపించిన మహోన్నత వ్యక్తే సానా సతీష్ బాబు. తన సయంకృషితో, తన స్వశక్తితో ఒక్కో మెట్టు ఎదుగుతూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. ఎంత ఎదిగినా పెద్దల పట్ల వినయ విధేతలను, పిన్నల పట్ల ప్రేమాభిమానాలను చూపడం మాత్రం మరువలేదు. మర్రి చెట్టు ఊడలు విస్తరించి పక్షులు, జంతువులకు నీడనిస్తుంది. అలానే సానా సతీష్ బాబు కూడా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ తనను ఆశ్రయించిన వారికి నీడనిస్తున్నారు. వారు ఎదగడానికి అన్ని విధాల అవకాశం కల్పిస్తున్నారు. ఎందుకంటే స్వశక్తితో ఎదిగిన వారికే కష్టం విలువ తెలుస్తుంది. దాని ఫలితం వలన కలిగే ఆనందం, ఇతరుల జీవితాలను ఆ ఫలితం ప్రబావితం చేసే తీరు అనుభవంలో ఉంటుంది. అందుకే ఔత్సాహిక క్రీడాకారులైనా, పారిశ్రామికవేత్తలైనా, వ్యాపారవేత్తలైనా వారు జీవితంలో నిలదొక్కుకోవడానికి సానా సతీష్ బాబు అండగా నిలుస్తారు. స్వయంకృషితో ఎదగాలనుకునే వారికి స్ఫూర్తి ప్రదాతగా కనిపిస్తారు.
1994లో సాధారణ ప్రభుత్వ అసిస్టెంట్ ఇంజనీరుగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన విధులను నిబద్ధతతో, నిజాయితీగా నిర్వర్తించి అందరి మనన్నలు పొందారు. ప్రభుత్వ పెద్దలను శభాష్ సతీష్ బాబు అనిపించుకున్నారు. అంటే విధుల పట్ల అంత శ్రద్ధ కలిగి ఉండేవారు సానా సతీష్ బాబు. తనకు అప్పగించిన పనులను ఎంతో అంకిత భావంతో పూర్తి చేసేవారు. అందుకే అనతి కాలంలోనే పదోన్నతులను పొందారు. 2004లో ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛంధ విరమణ ప్రకటించారు. జీవితంలో సాధించాల్సింది ఎంతో ఉందనే భావనతో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ కు చేరుకున్నారు. నిర్మాణ రంగంలోకి దిగారు. పెట్టుబడి సరిపోలేదు. అనుభవం లేక ఇబ్బందులు తలెత్తాయి. కానీ ఎక్కడా కూడా సానా సతీష్ బాబులోని ఆత్మవిశ్వాసం తగ్గలేదు. మరింత పట్టుదలతో ముందు అడుగులు వేశారు. అనతి కాలంలో నిర్మాణ రంగంలో ధ్రువ తారగా అవతరించారు. అక్కడితో ఆగకుండా బేవరేజస్, పోర్ట్, గ్రీన్ ఎనర్జీ వంటి వివిధ రంగాల్లో అనూహ్య విజయాలను సొంతం చేసుకున్నారు. పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో దిగ్గజంగా మారారు. దీనంతటికి కారణం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని ఒప్పుకోవద్దనే ఆయన ఆత్మస్థైర్యం ఒక కారణమైతే లక్ష్యం సాధించే వరకు శ్రమను మరువద్దనే ఆయన విశ్వాసం మరో కారణం. అందుకే నేటికి కూడా ఆయన అడుగుపెట్టిన ప్రతి రంగంలో విజయం సాధిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.