ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే సామెత ఉంది. అది ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు సరిగ్గా సరిపోతుందని అంటున్నారు జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు. ఆ మాటలేమి ఊరికెనే అనట్లేదు, వారి స్వానుభవంతో చెబుతున్న మాటలు. అంటే ఎంతటి అక్రమాలను, అన్యాయాలను భరించి ఉంటే అంతటి మాట అంటారు. చంటిగాడు లోకలే కాదు చంటి గాడు దోపిడీదారుడని కూడా ఆరోపిస్తున్నారు. అంటే తండ్రిని మించిన తనయుడుగా ఎదిగిపోయాడు సీఎం జగ్గడి శిష్యుడైన జ్యోతుల చంటిబాబు. అంతేలే గతంలో చంటిబాబు తండ్రి సొసైటీ చైర్మనుగా పదవీ బాధ్యతలను వెలగబెట్టారు. అది కూడా మాములూగా కాదొండయ్. తన ఆస్తులను అమాంతంగా పెంచుకొని ప్రజాసేవని ప్రచారం చేసుకున్నారు. అదెలా అనుకుంటున్నారేమో! సొసైటీ చైర్మనుగా పనిచేసే రోజుల్లో చంటిబాబు కుటుంబానికి 18ఎకరాల భూమి ఉండేది. పదవీ కాలం పూర్తయ్యేలోపు ఆ భూమి ఏకంగా 54 ఎకరాలకు పెరిగింది. అంటే అర్థం చేసుకోవచ్చు తండ్రి ఎంతటి నీతిమంతులో అని. అందుకే ప్రజలు ఆ సామెత ఎమ్మెల్యే చంటిబాబుకు నప్పుతుందని చెబుతున్నారు.
తండ్రి చూపిన బాటలోనే చంటిబాబు నడుస్తూ అవినీతి, అక్రమాలు, దోపిడీకి తెరలేపారని జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేకపోలేదు. అక్రమ గ్రావెల్ మైనింగ్, రైతుల భూములు ఇలా దేనిని వదలకుండా తన జేబులోకి తీసేసుకున్నారట. అందుకే ఆయన పేరు చెబితే భూయజమానులు అయ్య బాబోయ్ అంటారట. ఎలా కాపాడుకోవాలోనని తర్జనభర్జన పడతారట. కాంట్రాక్ట్ అయినా, ప్రజా సంక్షేమ కార్యక్రమాలైనా కమీషన్ అందాల్సిందేనని ఖరాకండిగా చెబుతారట. అందుకే దోపిడీకీ కేరాఫ్ అడ్రస్ ఎవరయ్యా అంటే జ్యోతుల చంటిబాబేనని రెండో ఆలోచన లేకుండా చెప్పేస్తున్నారు జగ్గంపేట ప్రజలు. అయినా కాకినాడ కేడీ అనింపించుకోవాలంటే ఆ మాత్రం ఉండాలిలే!