ఒక సామాన్యుడిగా జీవితం ప్రారంభించి. అంచెలంచలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తి సానా సతీస్ బాబు. జీవితంలో చిన్నగా ప్రారంభమై క్రమక్రమాభివృద్ధి పొంది మిన్నగా ఆయన ఎదిగారు. ఇంతింతై వటుడింతయై అన్నట్టుగా ఆయన ప్రగతి క్రమం సాగింది. ఎదురులేని సామ్రాజ్యాన్ని నిర్మించుకునే స్థాయికి చేరింది. అందుకే ఏ ఒక్కరిని పలకరించినా ఆయన పట్ల ప్రేమాభిమానాలే తప్ప, ఒక్క తప్పు మాటైనా పలకదు. ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన సానా సతీష్ బాబులో ఇసుమంతైనా అహంకారం కనిపించదు. నేను అనే గర్వం ఇంత కూడా ప్రతిబింబించదు. మాటల్లో ఆప్యాయత, పలకరింపులో ఆదరణ, వ్యక్తిత్వంలో మానవత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. నిలువెత్తు ఆత్మ విశ్వాసానికి ప్రతిరూపం సానా సతీష్ బాబు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఎంతో ఆత్మవిశ్వాసం, బలమైన సంకల్పం ఉంటే తప్ప జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఆషామాషీ విషయం కాదు. అందులోనూ మానవత్వ విలువలను కాపాడుకుంటూ లక్ష్య సాధన వైపు సాగడం నిజంగా ఎంతో గుండె నిబ్బరం ఉన్నవారికే సాధ్యమవుతుంది. అడుగడుగునా అవకాశవాదులు, మోసం చేయాలని చూసేవారు ఎదురుపడుతుంటారు. వారిని దాటుకొని లక్ష్యం వైపు పయనమవ్వాలి. అటువంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్ని ఓ ధ్రువ తారలా వ్యాపార సామ్రాజ్యంలో వెలుగొందుతున్నారు.
సానా సతీష్ బాబు అదృష్టాన్ని ఎన్నడూ నమ్ముకోలేదు. తన లక్ష్య సాధన కోసం కర్మను ఆచరణలో పెట్టారు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్నారు. నేర్చుకున్న పాఠాల అనుభవంతో జీవితంలో ముందడుగు వేశారు. అందుకు ఎన్నో వ్యయ ప్రయాసలను కూర్చి ఒక శక్తిగా ఎదిగారు. అందుకే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మాటలను ఆచరణలో పెడుతూ ఎంతో సాదాసీదాగా కనిపిస్తారు. ఆయన జీవితంలో కేవలం కలలు కనలేదు. వాటిని సాకారం చేసుకోవాలని అనుక్షణం తపన పడ్డారు. ఆ తపనే ఆయనను ఉన్నత స్థాయికి చేర్చిందని చెబుతారు. సానా సతీష్ బాబు ఒక సాధారణ విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీరుగా మొదలుపెట్టి వ్యాపార దిగ్గజంగా ఎదగడం వెనుక ఆయన పట్టుదల, కృషి ఎంతగానో ఉన్నాయి. 1994 సంవత్సరంలో ఉద్యోగం చేరిన తొలినాళ్లలోనే తుఫాను రూపంలో సవాలు ఎదురైంది. నాటి తుఫానుకు చాలా ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగిపోయాయి. ప్రజలు ఎన్నో అవస్థలకు గురవుతున్నారు. సానా సతీష్ బాబు ముందుకున్న ఒకే ఒక్క సవాల్ వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలి. ప్రజలకు ఉపశమనం కల్పించాలి. అదే సమయంలో సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమవ్వాలి. వాటన్నింటినీ కూడా మానవత్వాన్ని చాటుతూ చేసి చూపించారు. వారం రోజుల పాటు నిద్రాహారాలు మాని విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ మాత్రమే కాదు, వరద బాధితుల సహాయక చర్యల్లో పాలు పంచుకొని నాటి ప్రభుత్వ పెద్దలతో శబ్బాష్ సతీష్ బాబు అనిపించుకున్నారు. ప్రజా సేవ పట్ల ఆయనకున్న అంకిత భావం అటువంటిది. విధి నిర్వహణ పట్ల నిబద్ధత అంతటిది.
అందుకే ఆయన నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడంతో పాటు ఆ పాఠాల సారాన్ని అవపోసన పట్టి అనుభవాలను విజయాలుగా మలచుకోవడంలో స్ఫూర్తిని కలిగిస్తున్నారు సానా సతీష్ బాబు. ఎంతో మంది యువకులు ఆయన స్ఫూర్తితో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి అనూహ్య విజయాలను సొంతం చేసుకుంటున్నారు. అటువంటి వారికి వ్యాపారంలో ఆటుపోట్లు వచ్చినప్పుడు సానా సతీష్ బాబు వెన్నుదన్నుగా నిలుస్తూ ప్రోత్సహిస్తున్నారు. రంగం ఏదైనా కావొచ్చు సానా సతీష్ బాబు మా ఐకాన్ అంటున్నారు నేటి యువత. ఆయనలోని ఆత్మ విశ్వాసం, మానవత్వమే అంతటి అభిమానులను సంపాదించి పెట్టిందనడం నిజంగా సానా సతీష్ బాబు అభిమానులకు గర్వకారణం.