తుని నియోజకవర్గం ఒకప్పుడు ప్రశాంతమైన వాతావరణంతో ఉండేది. ఇప్పుడు ఎటు చూసినా అరాచాకం, దౌర్జన్యం కనిపిస్తున్నాయి. ప్రజలకు దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్లుగా పరిస్థితులు మారాయి. ఎవరైనా అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులు షరామామూలు అయ్యాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతికే దుస్థితులు నెలకొన్నాయి. దాడులు, రౌడీయిజంతో తుని నియోజకవర్గం అల్లకల్లోలం అవుతుందంటే దానికి కారణం ఎవరో కాదు.. నియోజకవర్గ ఎమ్మెల్యే, వైకాపా నాయకుడు దాడిశెట్టి రామలింగేశ్వర రావు ఊరఫ్ దాడిశెట్టి రాజా ఊరఫ్ రౌడీ రాజానే అనే అంటున్నారు ప్రజలు. సీఎం జగన్ రెడ్డి బాటలో నడుస్తూ ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. నియోజకవర్గానికి రౌడీలకు గూండాలకు కేంద్రంగా మార్చాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంచె చేను మేసిన చందంగా రక్షణగా ఉండాల్సిన అధికార పక్ష నేత అయ్యుండి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని బాధపడుతున్నారు. ఇలాంటి రౌడీ రాజాలు తమకొద్దంటూ గోడు వెల్లబోసుకుంటున్నారు. తుని నియోజకవర్గంలో రౌడీ రాజా రౌడీయిజం నుంచి తమకు విముక్తి కల్పించాలని వేడుకుంటున్నారు.
ప్రజాప్రతినిధిగా ఆదర్శంగా ఉండాల్సిన దాడిశెట్టి రాజా నేరస్తులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతనిపై ఇప్పటి వరకు 39 పోలీసు కేసులున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. కుట్రలు, కుతంత్రాలు, అక్రమాలు అతనికి వెన్నతో పెట్టిన విద్యని చెబుతున్నారు ప్రజలు. అతని అరాచకంతో అనునిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతికే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. గంజాయి రవాణా, దొంగ బంగారం విక్రయాల ద్వారా కోట్లాది రూపాయలు గడించిన దాడిశెట్టి రాజా ధన, అర్ధ, అంగ బలాలతో ప్రజల మాన, ప్రాణాలకు హాని కలిగిస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరుద్ర అనే మహిళను వేధించడమే కాకుండా ఆమె మానసికంగా దెబ్బతినేలా చేశాడని చెబుతుంటారు. ఇప్పటికీ దాడిశెట్టి రాజా అనుచరుల నుంచి బాధిత మహిళ పరోక్షంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తన అవినీతిని బయటపెట్టాడని ఓ విలేకరిపై దాడిశెట్టి రాజా కక్ష పెంచుకున్నాడని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. అంతేకాకుండా సమయం చూసిన సదరు విలేకరిని కిరాతకంగా హత్య చేసినట్లు పేర్కొంటున్నారు. అంటే తనకు అడ్డం వచ్చిన ఎవరినైనా రౌడీయిజంతో అడ్డు తప్పిస్తానని హెచ్చరికలు జారీ చేస్తున్నాడు ఈ రౌడీ రాజా. అంతేకాకుండా ప్రతిపక్ష నేతలపై కూడా దాడులు చేయిస్తూ వారిని అణచివేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అధికార పక్ష ఎమ్మెల్యే కావడంతో అతన్ని అడ్డుకునేవారు లేకుండా పోయారని ప్రజలు నిర్లిప్తతను వ్యక్తం చేస్తున్నారు.