కోటి తిప్పలు కూటి కోసమేనని సామెత. అవును ఆ సామెత అక్షరాల నిజం. ఏ మనిషైనా కష్టపడేది ఓ నాలుగు ముద్దలు నోట్లోకి వెళ్లాలని, తన కుటుంబ ఆకలి తీర్చాలని. అందుకే పని చిన్నదైనా, పెద్దదైనా అది గౌరవప్రదమైనదే. కొందరు కూలీ పనులకు వెళ్తారు, కొందరు చిరుద్యోగాలు చేస్తారు, కొందరు చదువుకు తగిన ఉద్యోగాలు చేస్తే, మరికొందరు నైపుణ్యం ఆధారంగా ఆదాయాన్ని పొందుతారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో పని. ఉద్యోగాలు చేసేవారికి ప్రతి నెలా కొంత మొత్తం అని నిర్ణీతంగా వస్తుంది. దానితో వారి జీవన అవసరాలు తీరుతాయి. కొందరికి సంపాదన అవసరానికి మించి ఉంటుంది. వారు విలాసాలకు కూడా వెచ్చిస్తారు. కానీ విలాసాలు పొందలేకపోయినా కుటుంబ కనీస అవసరాలను తీర్చడానికి కొందరు స్వయం ఉపాధిని ఎంచుకుంటారు. వారిలో నిరుపేద, దిగువ మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. వీధుల్లో చిరు వ్యాపారాలు చేస్తూ కుటుంబ పోషణ చేస్తారు. చాలిచాలని సంపాదనతో జీవితాన్ని నెట్టుకొస్తారు. అలాంటి చిరు వ్యాపారుల సంక్షేమాన్ని, వారి వ్యాపార బలోపేతాన్ని సానా సతీష్ బాబు ఫౌండేషన్ మనసారా కోరుకుంటుంది. అందుకే వారికి సహాయం చేస్తూ వెన్నుదన్నుగా నిలుస్తోంది.
చిరు వ్యాపారుల్లో కొందరు బడ్డీ కొట్టు పెట్టుకుంటారు, మరికొందరు బజ్జీలమ్ముతారు, ఇంకొందరు పుల్లట్లు విక్రయిస్తారు, పండ్లను అమ్ముతారు. బొమ్మలను అమ్మి ఉపాధి పొందేది కొందరైతే, మోచీ పనులు చేసి పైసలను కూడబెట్టుకునే వారు మరికొందరు. కూరగాయలమ్మి నాలుగు రూపాయలు వస్తాయనుకునేది కొందరైతే, తినుబండారాలు అమ్మి ఇల్లు గడవాలని చూసేవారు మరికొందరు. ఇలా వ్యాపారం ఏదైనా అది చిన్నపాటిదే. అందుకు పెట్టుబడి ఎంతో కొంత మొత్తమే. వేలు, లక్షలు సంపాదించకపోయినా వందలు సంపాదించి పచారు కొట్టుకు వెళ్లి సామాన్లు కొనుక్కొని ఆకలి తీర్చుకోవాలనుకునే వారే వారిలో ఎక్కువ. అచ్చం అలాంటి వారినే సానా సతీష్ బాబు ఫౌండేషన్ గుర్తిస్తోంది. ఎందుకంటే వారందరికీ ఎండైనా, వానైనా ఒక్కటే. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉంటారు. కొందరికి సరైన సౌకర్యాలు ఉండవు. వారికి కావాల్సిన కనీస వస్తువులను ఫౌండేషన్ అందిస్తోంది. అంతేకాకుండా వారి వ్యాపారానికి కావాల్సిన చేయూతనిస్తోంది. గొడుగుల పంపిణీ నుంచి ఇతర పరికరాలు, పనిముట్లు సమకూర్చేందుకూ సహకారాన్ని అందిస్తోంది. చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు