మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. అక్షరాల దాన్ని ఆచరణలో చూపిస్తున్న మహోన్నత వ్యక్తి సానా సతీష్ బాబు గారు. పారిశ్రామికవేత్తగా, వ్యాపారవేత్తగా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ఆయనకు ప్రజల కోసం ఏమైనా చేయాలనే తపన వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే సమాజం నుంచి ఎంతో పొందే మనం, సమాజానికి వీలైనంత తిరిగి ఇవ్వడం పౌరులుగా మన బాధ్యతని సతీష్ బాబు గారు అంటారు. కేవలం మాటలకే పరిమితం అవ్వగుండా చేతల్లో చేసి చూపిస్తారు. అందుకే ఎంతో మంది దాతలకు ఆయన ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవా మార్గంలో వేలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తున్నారు.
తన సొంత జిల్లా కాకినాడలో ఉన్న పేదలు, దీనులను ఆదుకోవడానికి సానా సతీష్ బాబు సంకల్పించారు. అందుకోసం ఎటువంటి సహాయానికైనా ఎల్లప్పుడూ ఆయన ముందు ఉంటారు. స్వపర భేదం లేకుండా ఆర్తులు ఎవరు వచ్చినా తగిన సాయం చేస్తారు. దాన ధర్మాలు చేసే విషయంలో ఆయన చేతికి ఎముక లేదని సతీష్ బాబు గారి సన్నిహితులు అంటారు. అంటే అంతగా దాన ధర్మాలు చేస్తారు సతీష్ బాబు గారు.
కేవలం నామ మాత్ర సేవా కార్యక్రమాలు చేసి సరిపెట్టకుండా వాస్తవంగా జీవితాలు మార్చే సేవా కార్యక్రమాలకు సానా సతీష్ బాబు గారు శ్రీకారం చుట్టి సానా సతీష్ బాబు ఫాండేషన్ ప్రారంభించారు. ఫౌండేషన్ ద్వారా విద్యార్థులు, యువత, వృద్ధులు, వెనుకబడిన వర్గాలు, నిరుపేదలు, దీనులకు అండగా నిలుస్తున్నారు. వారికి కావాల్సిన వసతులను కల్పిస్తున్నారు.
అవసరమైన చోట ఆర్థిక చేయూతను అందిస్తూ అండగా నిలుస్తున్నారు.
సేవ అంటే కేవలం దానం చేయడమే అనే భావనను సతీష్ బాబు గారు ఏ మాత్రం విశ్వసించారు. వ్యక్తులు సొంత కాళ్లపై నిలబడేలా చేయడం కూడా సేవగానే భావిస్తారు. అందుకే దాన, ధర్మాలతోనే సేవా కార్యక్రమాలను సరిపెట్టరు. సొంత కాళ్లపై నిలబడాలని భావించే ప్రతిఒక్కరికి ఆర్థిక