తెల్లాపుర్ కాలనీ రమణ ప్రెసిడెంట్ చలామణితో భారీ అక్రమ దందాలు, అసోసియేషన్ సభ్యులకు తెలియని వైనం.
రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భారీ భూ దందాలు, సెటిల్మెంట్లు చేస్తున్నట్టు తెళ్లాపూర్ కాలని వాసులు చెప్తున్నారు. అసోసియేషన్ మెంబర్లకు తెలియకుండా సెటిల్మెంట్లు, లోకల్ కాలని వాసులకు తెలియకుండా డబ్బులు వసూళ్ల పర్వానికి పాల్పడ్డారని ఆరోపణలు వినవస్తున్నాయి. అసోసియేషన్ మెంబర్ల ను కాలనీ అభివృద్ధి పేరుతో నమ్మించి ఈ వసూళ్లకు పాల్పడుతున్నారని, కొందరు బాధితులు చెప్తున్నారు.
కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు అంటూ హడావుడి చేస్తూ రోడ్ల అభివృద్ధికి తానే చేస్తున్నానంటూ అధికారులపై ఒత్తిళ్లు, బెదిరింపులు చేస్తూ స్థానికులకు ఏదైనా భూ సమస్య వస్తే కాలని ప్రెసిడెంట్ జోక్యం చేసుకొని సెటిల్మెంట్ చేస్తున్నారని, ఈ విషయాలు అసోసియేషన్ సభ్యులకు, స్థానిక ప్రజలకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెల్లాపుర్ నియోజవర్గం అయిన తదుపరి తదుపరి ఎమ్మెల్యే తానేనని, తదుపరి మున్సిపల్ చైర్మన్ తానేనని స్థానికంగా ప్రచారం చేసుకుంటున్నాడు. ఈ రాజకీయ వ్యూహాలు తెలియని అసోసియేషన్ మెంబర్లు అతడి వలలో పడుతున్నారని స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు. కొత్తగా ఏర్పడ్డ పోలీస్ స్టేషన్ కు తానే వాహనాలు, ఏసిలు ఇచ్చానని బూటకపు ప్రచారాలు చేసుకుంటున్నాడు. ఎస్సీ ఎస్సి, సైబరాబాద్ పోలీస్ ఏర్పాటు చేసుకున్న పెట్రోలింగ్ వాహనాలు కూడా తానే ఏర్పాటు చేశానని లోకల్ ప్రజలకు చెప్పుకుంటూ తన పరపతిని పెంచుతున్నాడని కాలని వాసులు వాపోతున్నారు.
అధికారులను, ప్రజలను లెక్కచేయకుండా
కొల్లూరు, తెల్లాపూర్ ప్రజల్లో గందరగోళం
నెలకొంది. అనధికారిక అసోసియేషన్స్ ప్రెసిడెంట్ పేరుతో ఇంత చేస్తున్న పోలీసులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. రోడ్ల వెడల్పు పేరుతో, డ్రైనేజ్ కాలువల అభివృద్ధి అంటూ తానే చేపిస్తా అంటూ కాలని వాసులకు టోపీ పెడుతున్నాడు. అలాంటి అక్రమాలతో కాలని ప్రెసిడెంట్ అని చెప్పుకొని తిరుగుతూ అక్రమాలు చేస్తున్న కానీ ఇవేమీ తెలియని అసోసియేషన్ సభ్యులు ఆ ప్రెసిడెంట్స్ చేసిన దానిలో ఇరుక్కుంటున్నారు.
ఇవే కాకుండా తెళ్లపూర్ ప్రెసిడెంట్ పేరుతో చేస్తున్న లే అవుట్లు భూ దందాలు, అక్రమాలకు నేతల అండదండలు కూడా ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అసోసియేషన్ ప్రెసిడెంట్ చేసిన అక్రమాలన్ని వాట్సప్ లో తెగ వైరల్ అవుతున్నాయి.