స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఇప్పటికే అరెస్ట్ చేశారు. త్వరలో నారా లోకేష్ ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి. టీడీపీకి రెండు కళ్ళుగా ఉన్న తండ్రి, కొడుకులు అరెస్ట్ అయితే టీడీపీ భవితవ్యం ఏం కావాలన్న చర్చ నడుమ నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలు టీడీపీ క్యాడర్ కు ఆశలు రేకెత్తిస్తున్నారు. కారణం..ఏపీలో ఎమర్జెన్సీ తరహ నిర్బంధాలు అమలులో ఉన్న వాటిని లెక్క చేయకుండా నిరసనలు చేస్తున్నారు. టీడీపీ చేపట్టాల్సిన కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ వారిద్దరూ అందులో భాగస్వామ్యం అవుతున్నారు.
చంద్రబాబుకు బెయిల్ రాకుండా అడ్డుపడినా, రాజకీయ కక్షతో నారా లోకేష్ ను అరెస్ట్ చేసినా పార్టీకి నాయకత్వ సమస్య రాదనీ అత్తాకోడళ్ళు నిరూపిస్తున్నారు. మాటలతోనే కాకుండా చేతలు కూడా ప్రారంభించారు. రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. వైసీపీ తీరును ఎండగడుతున్నారు. రాజకీయ అనుభవం లేకున్నా ఎలాంటి తడబాటు లేకుండా రాజకీయ నాయకురాళ్ళ వలె ప్రసంగించారు. చంద్రబాబు ఏ తప్ప చేయలేదు.. రాజకీయ కక్షతో ఆయన్ను జైలుపాలు చేశారనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. వారి ప్రసంగం చూసిన తరువాత టీడీపీకి నాయకత్వ సమస్య వచ్చే చాన్స్ లేదన్న అభిప్రాయాలను జనాలు సైతం వ్యక్తం చేస్తున్నారు.
నారా బ్రాహ్మణి స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె అనుభవం కల్గిన నేత వలె మాట్లాడటంతో ఆమెను రాజకీయాల్లోకి తీసుకురావాలనే డిమాండ్లు వస్తున్నాయి. రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై సూచనలు చేస్తున్నారు. నేతలతో కలిసి మాట్లాడుతూ నిరసనలు తెలుపుతున్నారు. ఆమెతో జనసేన నేతలు వచ్చి మాట్లాడుతున్నారు. చంద్రబాబు, లోకేష్ అక్రమ కేసులతో జైలుకు పరిమితం చేసినా అత్తాకోడళ్ళు టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చే సామర్ధ్యం కల్గి ఉన్నారని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Also Read : చంద్రబాబు అరెస్ట్ పై మోత్కుపల్లి రియాక్షన్ – కేసీఆర్ పర్మిషన్ ఉందా..?