ఖమ్మం జిల్లా వైరాలోని రెసిడెన్షియల్ స్కూల్ లో జరిగిన ఘటన తెలంగాణలోని విద్యా వ్యవస్థ యొక్క అధ్వాన స్థితిని మరొసారి బయటపెట్టింది. అక్కడ తొమ్మిది, పదో తరగతికి చెందిన ఆరుగురు విద్యార్థుల కాళ్ళకు, చేతులకు ఎలుకలు కరిచి గాయాలపాలయ్యారు. విషయం బయటకు తెలిస్తే ప్రభుత్వ పరువు పోతుందని రహస్యంగా ఆ ఆరుగురు విద్యార్థులకు వైద్యం చేయించారు. ఎలుకలు కరిచినట్లు బాధిత విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఈ విషయం కాస్త బయటకు వచ్చింది. దీంతో ఖమ్మం డీఈవో స్కూల్ కు వెళ్లి పరిశీలించగా.. తరగతి గదుల్లో మళ్ళీ ఎలుకలు కనిపించాయి.
తెలంగాణలో విద్యా వ్యవస్థ ఆదర్శంగా ఉందని ఉపన్యాసాలు ఇచ్చే పాలకులకు ఇలాంటి సంఘటనలు ఏమాత్రం కనిపించవు. కనీసం ఆ విద్యార్థులను పరామర్శించాలనే సోయి ఉండదు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కల్గించేలా చర్యలు చేపట్టాల్సిన పాలకులు ఆ దిశగా ఏమాత్రం ముందుకు సాగడం లేదు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్య పడిపోతుంది. కారణం.. స్కూల్లో మౌలిక వసతులు లేకపోవడం, టీచర్ల కొరత ఉండటం..వసతి గృహాలలో నాణ్యమైన భోజనం అందించకపోవడం.. ఇవన్నీ సర్కార్ విద్యపై సామాన్యులకు నమ్మకాన్ని సడలెలా చేశాయి.
ఇలాంటి తరహ ఘటనలు వరుసగా జరుగుతుండటంతో ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతారా..?ఆలోచించాలి. తన కొడుకును ఉన్నత చదువుల కోసం అమెరికాకు పంపిన సకల శాఖ మంత్రి కేటీఆర్.. ఇక్కడి సామాన్యుల పిల్లలు ఎలుకలకు ఆహరంగా మారుతున్నా స్పందించడం లేదు. స్పందించాల్సిన విద్యాశాఖ మంత్రి కూడా స్పందించడం లేదు. ఇంత జరుగుతున్నా తెలంగాణ సర్కార్ సిగ్గు లేకుండా విద్యావ్యవస్థను గాడిన పెట్టామని, తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నదని గొప్పలు చెప్పుకుంటుంది.
Also Read : కేసీఆర్ కు వైరల్ ఫీవర్ కాదట – సోషల్ మీడియాలో 6 గ్యారంటీల పోస్ట్ వైరల్..!!