వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యా వ్యవస్థపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ స్కూల్ లో చదివే విద్యార్థులకు ట్యాబులు అందజేసి ప్రపంచంతో పోటీ పడేలా ఏపీ స్టూడెంట్స్ ను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు.
ఈ క్రమంలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో హైస్కూల్ లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు మాత్రమే ఉంది. ఆ తరువాత ఇంటర్మీడియట్ కోసం కాలేజ్ లకు వెళ్తున్నారు. అయితే.. పదో తరగతి తరువాత చాలామంది విద్యార్థులు చదువు మానేస్తున్నారు. అందుకే ఉన్నత పాఠశాలల్లోనే ఇంటర్ విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోందని తెలుస్తోంది.
అసెంబ్లీలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతీ మండలంలో ఎంపిక చేసిన హైస్కూళ్లలో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టడంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా విస్తరించాలని చూస్తున్నట్లు ప్రకటించారు. అదే జరిగితే హైస్కూల్ లో ఇంటర్ మీడియట్ వరకు విద్యా బోధన జరగనుంది.
Also Read : ఒకే తరహ కేసు – భిన్నంగా లాయర్ ముకుల్ రోహాత్గీ వాదనలు