సోమవారం తాజ్ కృష్ణలో తీన్మార్ మల్లన్న నేతృత్వంలో నిర్వహించిన బీసీల ఆత్మీయ సమ్మేళనం సెగ ప్రగతి భవన్ కు తాకిందా..? బీసీల చైతన్యంతో తమ పీఠాలు కదులుతాయని ప్రగతి భవన్ లో కలవరం మొదలైందా..? తాజ్ కృష్ణలో బీసీల భేటీపై నివేదిక ఇవ్వాలని కేసీఆర్ కోరారా..? అంటే అవుననే తెలుస్తోంది.
అధికార బీఆర్ఎస్ కు బీసీల ఫీవర్ పట్టుకుంది. బీఆర్ఎస్ లో కేవలం 21మంది బీసీల నేతలకే టికెట్లు ఇవ్వడంతో ఆగ్రహంగా ఉన్న బీసీ సంఘాలు బీఆర్ఎస్ ను ఓడిస్తామని ప్రతినబూనుతున్నాయి. ఈ నేపథ్యంలో తాక్ కృష్ణలో బీసీల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి బీసీ మేధావులు, జర్నలిస్టులు, పలువురు బీసీ ఉద్యమకారులు హాజరై.. భవిష్యత్ కార్యాచరణపై ఏడుగంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. బీసీలకు అన్యాయం చేస్తే సహించేది లేదని.. ఎవరైతే బీసీలకు జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇస్తారో ఆ పార్టీకి రానున్న ఎన్నికల్లో అండగా ఉంటామని స్పష్టం చేశారు.
ఈ భేటీలో తీన్మార్ మల్లన్న చేసిన ప్రసంగం బీసీలను ఆలోచనలో పడేసింది. 52శాతం ఉన్న బీసీలు ఇంకా ఒక్క శాతం కూడా లేని వెలమ దొరలు ఇచ్చే పథకాల కోసం, టికెట్లు కోసం అడుక్కోవాలా..? కల్వకుంట్ల కవిత పిల్లలకు కళ్యాణ లక్ష్మీ ఇచ్చే స్థాయికి బీసీలు రాజకీయంగా ఎదగాలని మాట్లాడటం అందర్నీ కట్టిపడేసింది. ఈ నేపథ్యంలో ఈ భేటీపై ప్రగతి భవన్ అలర్ట్ అయినట్లు సమాచారం. తాజ్ కృష్ణలో జరిగిన సమావేశానికి వచ్చిన వారెవరు..? ఎవరెవరు ఏం మాట్లాడారు..? తాజా భేటీతో బీసీల్లో రాజకీయ చైతన్యం వచ్చే అవకాశం ఎంత మేర ఉంది..? ప్రస్తుతం నిర్వహిస్తోన్న భేటీలతో బీసీ నేతలు కలిసిపోయే అవకాశం ఏమైనా వస్తుందా..? అని కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది.
అందుకే బీసీల ఆత్మీయ సమ్మేళనంపై కేసీఆర్ అత్యవసరంగా ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.
Also Read : తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి – తెర వెనక ఉన్నది ఆ మంత్రేనా…?