పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నేత ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పార్టీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో శనివారం షోకాజ్ నోటిసు ఇచ్చారు. కాగా, పాలకుర్తి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తోన్న మహిళా నేత హనుమాండ్ల ఝాన్సీరెడ్డిపై కొన్ని రోజులుగా తిరుపతి రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆమె భాషా సామర్ధ్యంపై , వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి..బీఆర్ఎస్ కు అనూకూలంగా స్థానికంగా రాజకీయ పరిస్థితి మారుస్తున్నారని తిరుపతి రెడ్డిపై ఫిర్యాదులు అందాయి.
అంతేకాకుండా.. టికెట్ ఇంకా ఖరారు కాకముందే తనకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకోవడం పట్ల తిరుపతి రెడ్డిపై క్రమశిక్షణ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించింది. కాంగ్రెస్ పార్టీ మహిళా పక్షపాతి అని.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం పొందిన ఇలాంటి సమయంలో పార్టీలోని మహిళను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం సరైంది కాదని క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటిసుల్లో పేర్కొంది. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలనీ పార్టీకి నష్టం కల్గించే చర్యలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పార్టీలో సఖ్యతగా మెలగాలని.. పార్టీకి చేటు తెచ్చేలా వ్యవహరిస్తే పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పకనే చెప్పింది. కొద్దిరోజులుగా ఝాన్సీరెడీ టార్గెట్ గా విమర్శలు చేస్తోన్న తిరుపతి రెడ్డి షోకాజ్ నోటిసు రావడంతో ఆమెతో రేపటి నుంచి సఖ్యతగా మెలుగుతారా..? లేదంటే పార్టీ ఆగ్రహాన్నికి గురి అవుతారో చూడాలి.
Also Read : తొందర్లోనే కవిత అరెస్ట్ – ఆ తరువాత పెద్దాయనే టార్గెట్..?