ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ చేయడంతో..అక్రమాస్తుల కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ పరిస్థితి ఏంటన్న చర్చ ప్రారంభమైంది. తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న జగన్ పై విచారణ పూర్తిగా ఆగిపోయింది. దర్యాప్తు సంస్థలు చార్జీషీట్లను , ఆధారాలను సమర్పించింది. శిక్ష ఖరారు అవుతుందనుకున్న సమయంలో నిందితులు పక్కా ప్లాన్ తో పిటిషన్లు దాఖలు చేస్తూ హాయిగా బయట గడిపేస్తున్నారు. జగన్ సీఎం కూడా అయ్యారు. తనకు కోర్టు హాజరు అయ్యే విషయంలో మినహాయింపులు కావాలని ఆర్డర్స్ తెచ్చుకున్నారు.
ప్రజాకర్షక హామీలతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ.. ప్రజా ప్రతినిధులపైనున్న కేసుల విచారణను సంవత్సరంలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన పార్టీలోనే చాలామంది క్రిమినల్ నేరాల్లో నిందితులుగా ఉన్నారు. అందుకే కావొచ్చు.. ఆ హామీ అమలును ఏమాత్రం పట్టించుకోవడం లేదు. జగన్ ఆ పార్టీ నాయకుడు కాకపోయినా.. బీజేపీకి కావాల్సిన నేత. అత్యంత సన్నిహితుడు కూడా అనేది అందరికీ తెలిసిందే. అందుకేనేమో ఆయనపై విచారణ ఏమాత్రం ముందుకు సాగడం లేదన్న అభిప్రాయం నెలకొంది. మోడీ అండదండలు జగన్ కు పుష్కలంగా ఉండటంతోనే జగన్ దర్జాగా బయట ఉంటున్నాడని అంటున్నారు.
ఒకటి కాదు.. రెండు కాదు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ పై విచారణ ఆగిపోయింది. విచారణలో కదలిక ప్రారంభం అవుతుందో తెలియదు. కానీ, తన రాజకీయ ప్రత్యర్ధులను పక్కా ప్లాన్ తో అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా అడ్డు పడుతున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. రాజకీయ ప్రత్యర్ధులపై ఈ స్థాయిలో కక్ష సాధింపు చర్యలా.?అని జనమే విస్తుపోయేలా పరిస్థితులను మార్చేస్తున్నారు. చట్టాలను అయిన వారికీ చుట్టాలుగా.. కాని వారికీ విరోధులుగా మర్చేస్తున్నారన్న అభిప్రాయం జనాల్లో గూడుకట్టుకుంటే.. ప్రజలు విశ్వసించే న్యాయస్థానాలపై కూడా నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది.
Also Read : లోక్ సభ సీటా..? రాజ్యసభా..? -నాగార్జునకు వల వేస్తోన్న వైసీపీ..?