ఎస్ ఆర్ ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎల్ ఎల్ పి సంస్థ రియల్ వ్యాపారంలో ఓ వెలుగు వెలుగుతుతోంది. ఇప్పుడు ఈ సంస్థ అధినేత పి. శ్రీనివాస రెడ్డి సినిమా రంగంలోకి అడుగుపెట్టి ‘చీటర్’ అనే కమర్షియల్ సినిమాను నిర్మించారు. ప్రేమ ముసుగులో ఎవడిని పడితే వాడిని నమ్మి, గోవా లాంటి టూర్లకు వెళ్లి తమ శీలాన్ని అర్పించి నేటితరం అమ్మయిలు ఎలా మోసపోతున్నారో ఈ సినిమాలో చక్కటి సందేశంతో నిర్మించారు. నేటి తరం అమ్మయిలు, అబ్బాయిలు తప్పక చూడదగిన సినిమా ఇది. ఆర్ట్ సినిమా లాగా కేవలం సందేశం ఇవ్వకుండా ఓ కమర్షియల్ సినిమాకు కావలసిన అన్ని హంగులు ఉన్నాయి ఇందులో.
కథ
నేరస్తుడిగా బతికే హీరో కేవలం డబ్బు కోసం గొప్పింటి అమ్మాయిని చీటింగ్ చేసి ప్రేమ వలలో వేసుకొని బుద్ధిమంతుడిలా నటిస్తాడు. ఆమెను పెళ్లి వరకు లాక్కొచ్చి గోవాకు తీసుకెళ్లి శీలాన్ని దోచుకుంటాడు. నేటి అమ్మయిలు మగవాడి మాయమాటలు నమ్మి పెళ్ళికి ముందే ఎలా కాలుజారుతున్నారో ఇందులో చక్కగా చూపారు. ఎక్కడా కల్పితం లేదు. నేటి సమాజం ఎలా ఉందో అలాగే చూపారు. ఆ తర్వాత పెళ్లికి ముందు వాడు చీటర్ అనే విషయం హీరోయిన్కి తెలిసి కన్నీరుమున్నీరు అవుతుంది. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయో వెండితెర మీద చూసి ఎంజాయ్ చేయాల్సిందే.
ప్లస్ పాయింట్స్
ఇది పేరుకే చిన్న సినిమా. కానీ ఓ పెద్ద సినిమాకు ఉండవలసిన అన్ని కమర్షియల్ హంగులు ఉన్నాయి. ఇది దర్శకుడి సినిమా అనడం కంటే నిర్మాత సినిమా అనడంలో న్యాయం ఉంది. నిర్మాత పి. పి. శ్రీనివాస రెడ్డి ఉత్తమ అభిరుచి గల నిర్మాత అని ఈ సినిమా చాటింది. కేవలం డబ్బు కోసం కాకుండా, నేటి యువతకు ఓ మంచి సందేశం ఇవ్వాలి అనే తపన ఆయనలో కనిపించింది. ఇలాంటి నిర్మాతలు మనకు చాలా అరుదు. ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా పెద్ద సినిమా స్థాయిలో డబ్బు గుమ్మరించారు. చివరికి ఐటమ్ సాంగ్ కోసం భారీ సెట్ వేసి ప్రొడక్షన్ విలువలు ఎక్కడా తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. పాటలను అందమైన లొకేషలల్లో చిత్రీకరించారు. నటీనటులు తమ పాత్రలను న్యాయం చేశారు. హీరో కి మంచి భవిష్యతున్నది. ఉన్న మూడు పాటల్లో ఐటమ్ సాంగ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో సస్పెన్సు తో పాటు క్రైమ్ బాగా నడిచింది. టెన్షన్ తో నరాలు బిగపడతాయి. ఊపిరి తీయడం మరిచిపోతాము. ఎక్కడా బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా సినిమా నీటుగా, హాయిగా సాగిపోతుంది. ఫామిలీ సమేతంగా చూడదగిన యూత్ సినిమా.
మైనస్ పాయింట్స్
సినిమాకు ఫోటోగ్రఫీ ప్రాణం. కానీ కెమెరా మెన్ బాగా తీసినప్పటికి కొన్ని చోట్ల డి.ఐ చేయించనట్లు డల్ గా ఉన్నాయి. దేవీ 70 ఎం ఎం లాంటి సినిమా హాల్లోనే కొన్ని చోట్ల డల్ గా కనిపిస్తే మిగతా చిన్న సినిమా హాల్లో పరిస్థితి ఏమిటో. నేపధ్య సంగీతం బాగున్నప్పటికీ ఆర్ ఆర్ చాలా చోట్ల డల్ గా ఉంది. చుట్టేసినట్లు ఉంది. హీరోయిన్ భర్త – సెకండ్ హీరో క్యారెక్టర్ లో క్లారిటీ లేదు. అతను హీరోనో, విలనో చివరి వరకు అర్థం కాదు. రచయిత, దర్శకుడు ఈ ఒక్క విషయంలో తడబడ్డారు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకా పని పెడితే బాగుండేది. కానీ సినిమా చూస్తుంటే ఈ మైనస్ పాయింట్లు ప్రేక్షకులు పట్టించుకోలేదు. సినిమాను బాగా ఎంజాయ్ చేశారు. హాల్ విజిల్స్ తో మారుమోగింది.
రేటింగ్ : 3. 5
Also Read : వరుణ్ తేజ్ తోపాటు నిహారిక పెళ్లి కూడా..?