తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన గుర్తింపు పొందిన హీరో రాజా.. పోలిటికల్ ఇన్నింగ్స్ షురూ చేశాడు. కాంగ్రెస్ పార్టీలో చేరాడు రాజా. వెన్నెల, ఆనంద్ సినిమాలతో తెలుగింటి కుర్రాడిగా కనిపించే రాజా.. తమిళ నేపథ్యం కల్గిన వ్యక్తి. తల్లి బ్రిటిషర్ కాగా, తండ్రి తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారని పలు ఇంటర్వ్యూలో చెప్పాడు రాజా.
సినిమాల మీద ఇంట్రెస్ట్ తో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ద్వారా నటుడిగా పరిచంయ్యాడు. ఆ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. తరువాత సినిమా అవకాశాలు వచ్చినా కథ ఎంపికలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో రాజా సినీ ప్రస్థానం ఎక్కవ కాలం సాగలేదు.
సినిమాలకు దూరమైనా రాజా తరువాత రాజకీయ అరంగేట్రం చేశారు. నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరాడు. వైఎస్సార్ మరణం తరువాత పార్టీలో ఎక్కడ కనిపించలేదు. తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏపీ పీసీసీ అద్యక్షుడు గిడుగు రుద్రరాజు సమక్షంలో రాజకీయంగా తిరిగి సొంత గూటికి చేరారు.
లౌకికవాదం ఆలోచనలు ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆనందంగా ఉందని రాజా అన్నారు. రాహుల్ గాంధీ ఆలోచన విధానం నచ్చే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మణిపూర్ అల్లర్ల సమయంలో రాహుల్ స్పందించిన తీరు తనను ఆకర్షించిందని.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
Also Read : హైదరాబాద్ కు రాహుల్ గాంధీ షిఫ్ట్..?