మహిళా రిజర్వేషన్ వెంటనే అమల్లోకి వస్తే అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకుంటోంది. అభ్యర్థులను అప్పటికప్పుడు ఎంపిక చేయడం కష్టమని అంచనా వేసిన కేసీఆర్.. ముందస్తుగా కొన్ని నియోజకవర్గాల్లో మహిళా అభ్యర్థులను పోటీకి మానసికంగా ప్రిపేర్ చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇదే పనిలో కేసీఆర్ తలమునకలై ఉన్నట్లు సమాచారం. సూర్యాపేట ఐసీడీఎస్ పీడీ పద్మకు మంగళవారం ప్రగతి భవన్ నుంచి పిలుపు అందటం చర్చనీయాంశంగా మారింది.
పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందనున్న నేపథ్యంలో ఆమెకు కేసీఆర్ నుంచి కబురు అందటం హాట్ టాపిక్ గా మారింది. మహిళా రిజర్వేషన్ వెంటనే అమలైతే ఆమెను తుంగతుర్తి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిపే ఆలోచనతోనే కేసీఆర్ ఆమెను పిలిచారని తెలుస్తోంది. మొదట జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డితో భేటీ అయిన పద్మ అనంతరం కేసీఆర్ ను కలవనుండటంతో…తుంగతుర్తి టికెట్ పై ఆమె అభిప్రాయాన్ని తెలుసుకునేందుకే కేసీఆర్ కబురు పెట్టారనే ప్రచారానికి బలం చేకూరినట్లు అవుతోంది.
ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఆయనకు మరోసారి ఛాన్స్ కష్టమేనని అనుకున్నారు. కాని సిట్టింగ్ లకే కేసీఆర్ దాదాపు టికెట్లు ఇవ్వడంతో కిషోర్ పట్ల కేసీఆర్ కరుణించారు. తాజాగా కేంద్రం మహిళా రిజర్వేషన్ కు పచ్చజెండా ఊపడంతో తుంగతుర్తితో సహా ఏయే స్థానాల్లో మహిళలకు టికెట్లు ఇవ్వాలనే అంశంపై కేసీఆర్ ముందస్తుగా కసరత్తు చేస్తున్నారు. ఎయె నియోజకవర్గాల్లో మహిళా ఆశావహులు ఉన్నారు..? వారి బలం, బలహీనతలు ఏంటి..? అనే అంశాలపై ప్రగతి భవన్ లో సుదీర్ఘంగా చర్చిస్తోన్న కేసీఆర్.. కీలక నేతలతో చర్చించి మహిళా రిజర్వేషన్ అమలైతే వెంటనే అభ్యర్థులను కూడా ప్రకటించేలా సిద్దం అవుతున్నారు కేసీఆర్.
Also Read : మహిళా రిజర్వేషన్ ఎఫెక్ట్ – కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ సీట్లు గల్లంతే..!!