మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారంలోపు లోక్ సభ , రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందితే.. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ బిల్లులో ఉంటాయి.
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందితే వెంటనే వీటిని అమలు చేయడం కష్టం అవుతుంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగే వరకు మహిళా రిజర్వేషన్ ను అమలు చేయడం కష్టం. అందుకే బిల్లులో మహిళా రిజర్వేషన్ ను ఎప్పట్నుంచి అమలు చేయాలనే దానిపై కాలపరిమితి పెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్నికలకు సమయం సమీపించడంతో 2029 నుంచి మహిళా రిజర్వేషన్ ను అమలు చేసే అవకాశం ఉంది.
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందితే అన్ని పార్టీలు 33శాతం మహిళలకు సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తే తెలంగాణలో దాదాపు 39సీట్లలో మహిళలు పోటీ చేస్తారు. అందులో మహిళ ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలు దాదాపు 30ఉండటం విశేషం.
గజ్వేల్, జహీరాబాద్, కామారెడ్డి, పటాన్ చెరు, కుత్బుల్లాపూర్, , నాంపల్లి, కార్వాన్, యాకత్ పురా, మేడ్చల్, జూబ్లిహిల్స్శేరిలింగంపల్లి, చేవెళ్ల, వనపర్తి,మహబూబ్ నగర్, మక్తల్, గద్వాల్, దేవరకొండ, హుజూర్ నగర్, తుంగతుర్తి, మునుగోడు, , స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేటములుగు, మహబూబాబాద్, సత్తుపల్లి, కొత్తగూడెం , పినపాక, ఇల్లందుతో పాటు మరికొన్ని స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది.
Also Read : మహిళా రిజర్వేషన్ పై కవిత సైలెంట్ – పోరుబాట మళ్ళీ ఎప్పుడో..?