తెలంగాణ ప్రజలు తాము ఏం చెప్పినా నమ్మేస్తారనే ధోరణితో ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మహిళలకు 33శాతం టికెట్లు బీఆర్ఎస్ కేటాయించినట్లుగా మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు అన్ని పార్టీల మెడలు వంచి మిగిలింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉందన్నట్లుగా కవిత అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు.
మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరి ఏంటో చెప్పిన తరువాతే హైదరాబాద్ లో సోనియా, రాహుల్ గాంధీలు అడుగు పెట్టాలని కవిత డిమాండ్ చేయడం విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితిలో జనం లేరని.. రాహుల్ గాంధీ అవుట్ డేటెడ్ లీడర్ అని కవిత ఎద్దేవా చేశారు. కవిత తన పార్టీలో మహిళలకు 33శాతం టికెట్లు ఇప్పించకుండానే ప్రత్యర్ధి పార్టీలను ప్రశ్నిస్తుండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
కవిత డిమాండ్ చేసినట్లుగా 33శాతం మహిళలకు టికెట్లు ఇవ్వాలంటే 119నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ 39స్థానాల్లో అవకాశం ఇవ్వాలి. కాని కేసీఆర్ ఇచ్చినవి కేవలం 7మాత్రమే. సొంత పార్టీలో మహిళా రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేయకుండా…ఆ దిశగా తండ్రిని ప్రశ్నించని కవిత.. ప్రత్యర్ధి పార్టీలను టార్గెట్ చేయడం కవితను నవ్వులపాలు చేస్తోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న పార్టీలోనే మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయించని కవిత.. ఇతర పార్టీలను ప్రశ్నించడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
కవిత వ్యాఖ్యలను చూసిన తెలంగాణ ప్రజానీకం..ముందు బీఆర్ఎస్ పార్టీలో 33శాతం రిజర్వేషన్లు కల్పించేలా చేసిన తరువాత ప్రత్యర్ధి పార్టీలను ప్రశ్నించాలని సూచిస్తున్నారు. కవిత తాను ఏం చెప్పినా జనం ఈజీగా నమ్మేస్తారనే భావన నుంచి బయటపడాలని హితవు పలుకుతున్నారు.
Also Read : బిగ్ డ్రామా – కాంగ్రెస్ లోకి చేరికలను అపేందుకే కవితకు ఈడీ నోటిసులు..?