ఎన్నికల అభ్యర్థులను ప్రకటించి బీఆర్ఎస్ ఎన్నికల రేస్ స్టార్ట్ చేయగా..కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఎన్నికల పోరులో హస్తం పార్టీ వెనకబడిందని విమర్శలు వస్తున్న వేళ ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే జమిలి ఎన్నికలపై క్లారిటీ రాగానే అదే రోజున సాయంత్రం మొదటి విడత అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయాలని డిసైడ్ అయింది.
40మందితో కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి విడత జాబితా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో సీనియర్లు, కాంపిటేషన్ లేని నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. 19నే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని అనుకున్నా…జమిలిపై పూర్తి స్పష్టత వచ్చాకే అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలతో 22కు వాయిదా వేశారు. అభ్యర్థుల ప్రకటనపై ఇప్పటికే కాంగ్రెస్ ఆలస్యం చేసిందని పార్టీ నాయకత్వంపై నేతల ఒత్తిడి పెరుగుతోంది. దాంతో ఇక ఆలస్యం చేయకుండా 22న అభ్యర్థులను ప్రకటించాలని ఫిక్స్ అయ్యారు.
ఫస్ట్ లిస్టులో ఎవరెవరి పేర్లు ఉంటాయోనని..?నేతలంతా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. సీనియర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలతో అభ్యర్థుల మొదటి జాబితా ఉండనుంది. రాష్ట్రవ్యాప్తంగా సునీల్ కనుగోలు టీమ్ చేస్తోన్న సర్వే ఇంకా పూర్తి కాకపోవడంతో రెండో జాబితా కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది.
Also Read : గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల జమున..?