తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ లో నోటిఫికేషన్ వెలువడకపోతే మే నెలలోనే ఎన్నికలు జరుగుతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు తెరలేపాయి. పాక్షిక జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణ చేస్తే తెలంగాణ ఎన్నికలు మే లో జరగడం ఖాయం. రాష్ట్ర అసెంబ్లీ గడువు జనవరి రెండో వారంలో ముగిసిపోతుంది. అలా ప్రభుత్వం రద్దు కాబడుతుంది.
జనవరిలో తెలంగాణ ప్రభుత్వం రద్దైతే ఎన్నికలకు మరో ఐదు నెలలు ఉంటుంది. దాంతో పాలన ఎవరి చేతుల్లోనే ఉంటుంది..? అనేది ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం రాష్ట్రపతి పాలన విదిస్తుందనేది తెలిసిందే. రాష్ట్రపతి పాలన విధిస్తే బీజేపీకి కూడా కలిసి వస్తుంది. తెలంగాణతోపాటు చత్తీస్ ఘడ్, రాజస్తాన్ లలో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయి. అక్కడ కూడా మే నెలలోనే ఎన్నికలు జరుగుతాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించి పాలనను అనధికారికంగా కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటుంది.
తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిస్తే రాజకీయ పరిణామాలు వేగంగా మారుతాయి. అధికారం బీఆర్ఎస్ చేతుల్లో నుంచి బీజేపీ చేతుల్లోకి వెళ్తే ఆ ఐదారు నెలలు ఎన్నో సంచలనాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. వీటన్నింటిని చూస్తుంటే కేంద్రం మినీ జమిలి పేరుతో మే నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. బీజేపీ కోరుకుంటే ఇదే చేయగలదు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ , కాంగ్రెస్ లో టెన్షన్ మొదలైంది.
Also Read : బీఆర్ఎస్ అభ్యర్థులు కాంగ్రెస్ లోకి – దూకుడు పెంచిన రేవంత్