సెప్టెంబర్ 17న ఊహించని విధంగా పార్టీలో చేరికలు ఉంటాయని, ఊహించని విధంగా ట్విస్టులు ఇస్తామని కాంగ్రెస్ నేతల ప్రకటనలు ఆసక్తి రేపుతున్నాయి. సోనియా సమక్షంలో బీఆర్ఎస్ , బీజేపీ నేతలను కాంగ్రెస్ లో చేర్పించేందుకు రేవంత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ట్విస్టులు ఉంటాయని చెప్తుండటంతో తెలంగాణలో సొనియా సభ పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది.
ఇప్పటికే తుమ్మల నాగేశ్వర్ రావుతో రేవంత్ భేటీ అవ్వడంతో ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారన్న సంకేతాలను ఇచ్చారు. ఆయన సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. మైనంపల్లి హన్మంతరావు కూడా తన కుమారిడితో కలిసి కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. వీరే కాకుండా చాలామంది నేతలు కాంగ్రెస్ లో చేరుతారని ప్రకటిస్తుండటంతో హస్తం వైపు వెళ్తున్న నేతలెవరు? అనే ప్రశ్నలు బీఆర్ఎస్ , బీజేపీల్లో కలవరం రేపుతున్నాయి.
మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. బీఆర్ఎస్ లో టికెట్లు వచ్చిన అభ్యర్థులు కూడా కొందరు కాంగ్రెస్ లో చేరుతున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మైనంపల్లి కాకుండా కాంగ్రెస్ తో టచ్ లో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరు..? అనే చర్చ జోరందుకుంది. ఈ ప్రకటనలు వ్యూహాత్మకంగా చేస్తున్నారో మరేదో కానీ సొనియా సభపై భారే అంచనాలను నెలకొనేలా కాంగ్రెస్ సక్సెస్ అవుతున్నట్లు కనిపిస్తోంది.
Also Read : బీఆర్ఎస్ కు డేంజర్ బెల్స్ – లేటెస్ట్ సర్వే రిజల్ట్ ఇదే..!!