కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహణ జమిలి ఎన్నికల కోసమేనని వార్తలు వస్తుండగా కేంద్రమంత్రి, బీజేపీ ఎన్నికల తెలంగాణ ఇంచార్జ్ ప్రకాష్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు ఉండబోవని …లోక్ సభ , అసెంబ్లీకి వేర్వేరుగానే ఎన్నికలు జరుగుతాయని జమిలి ఎన్నికలపై కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరదించారు.
వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లును ఈ పార్లమెంట్ లో సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఆ బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించినా.. రాజ్యసభలో ఆమోదం పొందటం కష్టమే. దాంతో కేంద్రం ఈ బిల్లు ఆమోదం కోసం ఎం చేయబోతుంది..? అనేది ఆసక్తికరంగా మారింది. జమిలి ఎన్నికల కోసం ఐదు రాజ్యాంగ సవరణలు కూడా చేయాల్సి ఉంది. దీంతో వీటన్నింటిని దాటుకొని జమిలి ఎన్నికలు ఈసారి సాధ్యం కాదని న్యాయనిపుణులు, రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
జమిలి ఎన్నికలను కేంద్రం వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకోచ్చిందన్న విమర్శలు తాజాగా వినిపిస్తున్నాయి. ఇండియా కూటమి కార్యక్రమాలు వేగవంతం అవుతున్న నేపథ్యంలో ఆ కూటమిని డిఫెన్స్ లోనే నెట్టివేసేందుకు జమిలిని ఇప్పట్లో సాధ్యం కాకపోయినా కావాలనే తెరమీదకు తీసుకొచ్చారా అనే అనుమానాలు ప్రకాష్ జవదేకర్ కామెంట్స్ తో ఉత్పన్నం అవుతున్నాయి.
మరోవైపు…ఇటీవల జమిలి ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరిన దశలో ప్రతిపక్షాలు ఆ దిశగా సిద్దం అవుతున్నాయి. జమిలి ఎన్నికలు జరిగితే ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు జరుపుతున్నాయి. వ్యూహాలను రెడీ చేసుకుంటున్నాయి. దీంతో ప్రతిపక్షాల స్పీడ్ కు బ్రేకులు వేసేందుకే కేంద్రమంత్రి వ్యూహాత్మకంగా జమిలి ఎన్నికలను కొట్టిపారేశారా..? అనే వాదనలు కూడా వస్తున్నాయి.
Also Read : డేంజర్ జోన్ లో పది మంత్రులు – క్లాస్ పీకిన కేసీఆర్..!