హోంగార్డులను పర్మినెంట్ ఇస్తామని కేసీఆర్ హామీ ఇవ్వడం.. హామీని నెరవేర్చకపోవడం కేసీఆర్ కు రివాజుగా మారింది. 2014 నుంచి పలు వేదికలపై కేసీఆర్ ఏడుసార్లు హోంగార్డులను రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు ఆ హామీని అమలు చేయలేదు. ఫలితంగా జీతాల కోసం అధికారుల కాళ్ళవెళ్ళా పడటం.. అధికారుల నుంచి చీదరింపులు.. ఇవన్నీ భరించలేక రవీందర్ అనే హోంగార్డు తాజాగా ఆత్మహత్యయత్నం చేశాడు. ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.
ఒకే హామీ.. కొత్త వేదిక.. సరికొత్తగా హామీ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014, జూన్ 20 న హోంగార్డుల సమస్య పరిష్కారానికి చర్యలు చూపుతానని కేసీఆర్ హామీ ఇచ్చారు. 2014, జూన్ 22న జరిగిన సూపర్ కాప్ మీటింగులో హోంగార్డులను రెగ్యులరైజ్ చేస్తానని మరోసారి హామీ ఇచ్చారు. ఆ తరువాత మూడేళ్ళు కాలయాపన చేసిన కేసీఆర్ 2017,జనవరి 31న భక్తరామదాసు ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో హోంగార్డులకు కానిస్టేబుల్ గా పదోన్నతి కల్పిస్తామని హామీ ఇచ్చారు.
2017మార్చి 27న అసెంబ్లీ సాక్షిగా మరోసారి హామీ ఇచ్చారు. 2017,మే 29న బీఆర్ఎస్ భవన్ లో హోంగార్డులను రెగ్యులరైజ్ చేస్తానని చెప్పారు. అదే ఏడాది జరిగిన పోలీసు ఆఫీసర్స్ సమావేశంలో హోంగార్డులను స్కేల్ ఉద్యోగులుగా మారుస్తామన్నారు. డిసెంబర్ 13న ప్రగతి భవన్ లో హోంగార్డులకు మంచి జరిగేలా చూస్తానని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ , హెల్త్ కార్డులను ఇస్తామని చెప్పారు. ఇలా కేసీఆర్ తనకు అవసరమైనప్పుడల్లా హోంగార్డులకు హామీలు ఇచ్చారు తప్పితే హమీని నెరవేర్చేందుకు ఏనాడూ ప్రత్యేక శ్రద్ధ చూపలేదు.
తెలంగాణలో 16వేల మంది హోంగార్డులు ఉన్నారు. ఐదేళ్ళ సర్వీసు ఉన్న వారిని పర్మినెంట్ చేస్తామని కేసీఆర్ హామీఇచ్చారు కానీ అమలు చేయలేదు. హోంగార్డులకు హెల్త్ కార్డులూ ఇవ్వలేదు. ఫలితంగా 2019సెప్టెంబర్ నుంచి 2023 జనవరి వరకు రాష్టవ్యాప్తంగా 202మంది హోంగార్డులు అనారోగ్య కారణాలతో మరణించారు. వాళ్ళను సర్కార్ ఆదుకోలేదు. దీంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
Also Read : బీఆర్ఎస్ లో బయటపడుతున్న కుమ్ములాటలు – కేటీఆర్ V/s హరీష్ రావు..?