ప్రేమను నిరాకరించినందుకు ఓ ప్రైవేట్ ఉపాధ్యాయురాలిని ఓ వ్యక్తి కత్తితో పొడిచిన ఘటన కూకట్ పల్లి పరిధిలో చోటుచేసుకుంది. ప్రేమను నిరాకరించినందుకే యువతిని కత్తితో పొడిచినట్లు తెలుస్తోంది.
ఆరు నెలల కిందట రాజు(32) అనే వ్యక్తికి సోషల్ మీడియాలో 23ఏళ్ల బాధితురాలు పరిచయమైంది. రాజును స్నేహితుడిగా మాత్రమే ఆమె భావించింది కానీ అతను మాత్రం ఆమెను ప్రేమించడం ప్రారంభించాడు. ఆ తరువాత కొన్నాళ్ళకు ప్రపోజ్ చేశాడు. అందుకు ఆమె తిరస్కరించింది. స్నేహం ముసుగులో ప్రేమిస్తున్నావా..? తాను మాత్రం ఎప్పుడు ఆ ఉద్దేశ్యంతో చూడలేదని స్పష్టం చేసింది.
ఇది గడిచిన తరువాత మహిళకు ఫోన్ చేసిన రాజు.. అత్యవసరంగా నిన్ను కలవాలంటూ కోరాడు. కలిసినప్పుడు మళ్ళీ తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎన్నిసార్లు ప్రపోజ్ చేసిన తన నిర్ణయం మారదని మహిళా ఖరాఖండిగా చెప్పేసింది.
దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న రాజు.. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఆమె కత్తితో పొడిచాడు. అనంతరం తాను ఆత్మహత్యయత్నం చేశాడు. దాంతో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని సమచారం.
Also Read : హైదరాబాద్ లో విస్తరిస్తోన్న కాల్ బాయ్స్ సేవలు