బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్ – హరీష్ రావుల మధ్య గ్యాప్ వచ్చిందా..? ఎన్నికల అభ్యర్థుల ఎంపిక సందర్భంగా ఇద్దరి నేతల మధ్య మనస్పర్ధలు తలెత్తాయా..? కేటీఆర్ తన అనుకూలురుకు టికెట్ ఇవ్వాలని పట్టుబడితే హరీష్ అంగీకరించలేదా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ కు కేటీఆర్ అండ్ హరీష్ రావులు మెయిన్ పిల్లర్స్. అందుకే అభ్యర్థుల ఎంపిక సందర్భంగా వారిద్దరి అభిప్రాయాలను పరిగణనలోకు తీసుకున్నారు. అయితే కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక సందర్భంగా కేటీఆర్ , హరీష్ రావుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని టాక్. నర్సాపూర్ లో సునీతా లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వాలని కేటీఆర్ పట్టుబట్టగా.. హరీష్ రావు మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికే ఇవ్వాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ నియోజకవర్గాన్ని కేసీఆర్ పెండింగ్ లో ఉంచారని అంటున్నారు.
మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మైనంపల్లి కొడుకు అంశాన్ని కేటీఆర్ తెరపైకి తీసుకొచ్చారని కానీ హరీష్ రావు మాత్రం పద్మా దేవేందర్ రెడ్డికే ఇవ్వాలని పట్టుబట్టినట్లు చెబుతున్నారు. మైనంపల్లి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు. దాంతో మైనంపల్లి రోహిత్ రావు అభ్యర్థిత్వంపై కేసీఆర్ వద్ద కేటీఆర్ ప్రస్తావించగా హరీష్ నిర్ద్వంద్వంగా ఈ అంశాన్ని తిరస్కరించినట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఉప్పల్ సీట్ ను బొంతు రామ్మోహన్ కు ఇవ్వాలని కేటీఆర్ చెప్పగా.. హరీష్ అందుకు నో చెప్పారట.
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ కు సీఎం బాధ్యతలు కట్టబెట్టడం లాంచనమే. అదే సమయంలో పార్టీలో, ప్రభుత్వంలో హరీష్ రోల్ ఎలా ఉండబోతుందనేది బిగ్ డిబేట్ గా మారింది. వీటన్నింటిని పసిగట్టి అభ్యర్థుల ఎంపికలో హరీష్ కాస్త కఠినంగా వ్యవహరించారని టాక్. ఎందుకంటే కేటీఆర్ సన్నిహితులకే టికెట్లు ఇస్తే భవిష్యత్ లో తనకు ఆదరణ ఉండదనేది హరీష్ ఆలోచనగా విశ్లేషకులు చెబుతున్న మాట.
అందుకే అభ్యర్థుల ఎంపికలో హరీష్ రావు నిజంగానే బెట్టు చేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు ఎనలిస్టులు. మొత్తంగా పార్టీలో హరీష్ , కేటీఆర్ ల మధ్య కొంత గ్యాప్ కు అభ్యర్థుల ఎంపిక బీజం వేసిందని.. రాను, రాను ఇది ఎటు దారితీస్తుందో చూడాలి.
Also Read : కేసీఆర్ ప్లాన్ బీ – మల్కాజిగిరి నుంచి కేటీఆర్ అనుచరుడికి అవకాశం..?