నిజామాబాద్ కాంగ్రెస్ అర్బన్ టికెట్ కోసం యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామర్తి గోపి దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం అనుచరులతో కలిసి గాంధీ భవన్ కు వచ్చిన రామర్తి గోపి తన దరఖాస్తును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…తెలంగాణలో దగాపడిన యువత గొంతును చట్టసభల్లో వినిపించేందుకు తనకు అవకాశం వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
52శాతం ఉన్న బీసీలకు బీఆర్ఎస్ కేవలం 23సీట్లు మాత్రమే ఇచ్చిందని.. కాంగ్రెస్ మాత్రం బీసీలకు గణనీయమైన సీట్లు కేటాయిస్తుందని నమ్మకం తనకు ఉందన్నారు గోపి. యువకులకు రాజకీయాల్లో అధిక అవకాశాలు ఇవ్వాలన్న రాహుల్ గాంధీ ఆదేశాలను టీపీసీసీ పాటిస్తుందన్నారు. బీఆర్ఎస్ యువత పట్ల అవలంభించిన విధానాలను యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళినట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించిన తనకు పార్టీ న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. కేవలం కాంగ్రెస్ లోనే కష్టపడి పని చేసే నేతలకు న్యాయం జరుగుతుందన్నారు.
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు భరోసానిచ్చానని.. పార్టీకి కష్టకాలంలో అండగా నిలబడిన తనకు పార్టీ టికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read : బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి కీలక నేతలు..?