తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు బీఆర్ఎస్ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఎన్నికల వేళ ఎవరిని డిసాపాయింట్ చేయవద్దని భావిస్తోన్న సర్కార్ పెద్దలు.. నిరుద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు గుడ్ న్యూస్ ప్రకటించారు.
ఎంతోకాలంగా వెయిట్ చేస్తోన్న డీఎస్సీ నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది ప్రభుత్వం. ఈ నోటిఫికేషన్ ద్వారా 5089టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. దీనిని డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నామని ప్రకటించారు. రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదలతోపాటు గైడ్ లైన్స్ ను విడుదల చేస్తామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
తెలంగాణలో వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తుండటంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. టీఎస్ పీఎస్సీ ద్వారా వేలాది పోస్టులను భర్తీ చేసిన సర్కార్ తాజాగా ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయాలనీ భావిస్తోంది. కీలకమైన విద్యాశాఖలో ఉపాధ్యాయుల కొరత ఉండటంతో తాజాగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు.
Also Read : కేసీఆర్ ను తలదన్నేలా పట్నం మహేందర్ రెడ్డి వ్యూహం..!?